రెండో భార్య చనిపోతే రాలేదని.. భర్త ఇంటి ఎదుట సమాధి

కుప్పం పరిధిలోని సింగారపురం గ్రామానికి చెందిన చెన్నైయ్యన్ కు ఇద్దరు భార్యలు. రెండో భార్యతో అతడికి పెద్దగా సంబంధాలు లేవు.

Update: 2023-10-31 04:41 GMT

ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న రెండో భార్య చనిపోతే.. ఆమెను పరామర్శించేందుకు ఆమె భర్త రాలేదన్న కోపంతో.. అతగాడి ఇంటి ఎదుటే ఆమె శవాన్నిపూడ్చి పెట్టిన షాకింగ్ వైనం తాజాగా చోటు చేసుకుంది. ఈ దూకుడు చర్యకు పాల్పడిన వారి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా చేసింది. అంతేకాదు.. భర్త ఇంట్లోకి వెళ్లి పెద్ద ఎత్తున దాడులకు పాల్పడటం షాకింగ్ గా మారింది. గ్రామంలో సంచలనమైన ఈ ఉదంతంలోకి వెళితే..

కుప్పం పరిధిలోని సింగారపురం గ్రామానికి చెందిన చెన్నైయ్యన్ కు ఇద్దరు భార్యలు. రెండో భార్యతో అతడికి పెద్దగా సంబంధాలు లేవు. వేర్వేరుగా ఉంటున్నారు. రెండో భార్య రత్తమ్మ ఇటీవల అనారోగ్యం బారిన పడింది. తాజాగా ఆమె మరణించింది. అయితే.. రత్తమ్మను చివరి చూపు చూడకుండా భర్త ముఖం చాటేశారు. రెండో భార్యను కడసారి చూసుకునేందుకు సైతం చెన్నయ్యన్ రాకపోవటాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

దీంతో.. స్థానిక ప్రజాప్రతినిధులంతా కలిసి.. తాజాగా రెండో భార్య డెడ్ బాడీని.. భర్త ఇంటి ముందు పూడ్చారు. అంతేకాదు.. ఇంట్లోకి జొరబడి సామాన్లను ధ్వంసం చేశారు. అయితే.. ఇదంతా జరిగే సమయంలో బాధితుడు ఇంట్లో లేరని చెబుతున్నారు. తన ఇంటి మీద దాడి జరిగిన ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Tags:    

Similar News