తెలుగు రాజకీయ నేరస్థుల లిస్టు ఇదే..
తాజాగా ఓ సర్వే తెరమీదికి వచ్చింది.
తాజాగా ఓ సర్వే తెరమీదికి వచ్చింది. దేశంలో 2019 తర్వాత.. వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకు న్న ఎమ్మెల్యే నేర చరిత్రను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్(ఏడీఆర్) సంస్త వెల్లడించింది. ఆయా ఎన్నికల సమయంలో అభ్యర్తులు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్ ఆధారంగా ఏయే పార్టీల్లో ఎంత మంది నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యే లు ఉన్నారో ఈ ఏడీఆర్ సంస్థ తెరమీదికి తెచ్చింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, అదేవిదంగా అసెంబ్లీలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లోని లెక్కలు వివరించింది.
ఈ క్రమంలో ఏపీ విషయానికి వస్తే.. మూడు పార్టీలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలో ఉంది. ఇక, టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో ఉంది.(వీరిలో నలుగురు పార్టీకి దూరమైనా.. కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం వారు టీడీపీ సభ్యులుగానే ఉన్నారు), అదేవిధంగా జనసేన తరఫున గెలిచిన ఒక అభ్యర్థి కూడా అసెంబ్లీలో ఉన్నారు. వీరు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్.. ఎక్కువ మంది నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువ సీట్స్ గెలిచినా వైసీపీలోనే ఉన్నారని అర్ధం అవ్వుతుంది .
దీనికి పక్కా ఆధారాలు.. ఆయా అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లేనని పేర్కొంది. ఇక, టీడీపీలోనూ ఇలాంటి వారు ఉన్నారు. జనసేనలో ఒక్కరే ఉండడంతో ఆయన గురించి ప్రస్తావించలేదు. వైసీపీ విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యేలు కలిగిన పార్టీల్లో 6వ స్థానంలో ఉంది. ఈ పార్టీలో 151 మంది ఎమ్మెల్యేల్లో 50 శాతం అంటే.. సగం మందిపై తీవ్ర కేసులు ఉన్నాయని తెలిపింది. వీటిలో హత్య, అత్యాచారాలు, హత్యాయత్నం, చివరకుదొంగతనం కేసులు కూడా ఉన్నాయని పేర్కొంది. ఇక, టీడీపీలోని 23 మందిలో 11 మందిపై కేసులు ఉన్నాయని తెలిపింది అంటే టీడీపీ లో కూడా 50 శాతం ఎమ్మెల్యే ల మీద కేసులు ఉన్నాయి. ఇక్కడ కూడా హత్యా యత్నం కేసులు ఎదుర్కొంటున్నవారు ఉన్నారు. అయితే.. 23 మంది మాత్రమే గెలించిన టీడీపీ మాత్రం దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలతో పోల్చుకుంటే 26వ స్థానంలో ఉంది.