13 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారం... యూకే వ్యక్తికి 12 ఏళ్ల జైలు!

టీచర్‌గా పనిచేస్తున్నప్పుడు కూడా పిల్లలను దుర్వినియోగం చేయడానికి ఆన్‌ లైన్‌ లో యువకులను బలవంతం చేసాడని తెలిసింది

Update: 2023-08-11 04:14 GMT

లండన్‌ లోని ఈస్ట్ డల్విచ్‌ కు చెందిన స్మిత్ (35), 13 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారం చేయడాన్ని ప్రోత్సహించడం, 13 ఏళ్లలోపు పిల్లలు లైంగిక కార్యకలాపాలకు పాల్పడేలా చేయడం, అలాగే పిల్లలపై అసభ్యకరమైన చిత్రాలను రూపొందించడం, వాటిని పంపిణీ చేయడం వంటి 22 నేరాలను అంగీకరించాడు.

అవును... లండన్ ప్రాథమిక పాఠశాలలో మాజీ డిప్యూటీ ప్రధాన ఉపాధ్యాయుడు, మాథ్యూ స్మిత్.. చిన్న పిల్లలను లైంగికంగా వేధించమని భారతదేశంలోని టీనేజర్లకు డబ్బు చెల్లించి, వారికి సూచించినందుకు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. స్మిత్ ఫోన్, ల్యాప్ టాప్ ల నుండి 120,000 పైగా పిల్లల అసభ్య చిత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుక్కతో సంభోగాన్ని చిత్రీకరిస్తున్న చిత్రం కూడా వాటిలో ఉండటం గమనార్హం.

ఇదే సమయంలో చాట్‌ లు, రికార్డుల ఆధారంగా స్మిత్ భారతదేశంలోని యువకులను టెలిగ్రామ్‌ లో తక్కువ వయస్సు గల అబ్బాయిలపై లైంగిక చర్యలు చేయమని సూచిస్తాడని చూపించారు. వాటికి ఉదాహరణలుగా ఫోటోలు, వీడియోలను వారికి పంపేవాడు. ఈ నేరలుకు గాను అతడు నవంబర్ 6, 2022న లండన్‌ లో అరెస్టయ్యాడు.

డార్క్ వెబ్‌ లో దుర్వినియోగ విషయాలను షేర్ చేసిన తర్వాత 35 ఏళ్ల యువకుడిని యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ అరెస్టు చేసింది. అనంతరం నేషనల్ క్రైమ్ ఏజెన్సీ విచారణలో అతను టీచర్‌ పనిచేస్తున్నప్పుడు కూడా పిల్లలను దుర్వినియోగం చేయడానికి ఆన్‌ లైన్‌ లో యువకులను బలవంతం చేసాడని తెలిసింది.

తాజాగా ఈ విషయంపై విచారణ ముగిసిన అనంతరం... స్మిత్ కు 12 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ, న్యాయమూర్తి మార్టిన్ గ్రిఫిత్ తీర్పునిచ్చారు. ఇదే సమయంలో స్మిత్‌ ను "ప్రమాదకరమైన వ్యక్తి" అని భావించినట్లు తెలిపారు. అనంతరం... స్మిత్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వల్ల అతని శిక్షను తగ్గించినట్లు పేర్కొన్నారు! కాకపోతే... జీవితాంతం లైంగిక నేరస్థుల రిజిస్టర్‌ లో స్మిత్ పేరుటుంది.

కాగా... స్మిత్ 2007 - 2014 మధ్య భారతదేశం అంతటా అనాధ శరణాలయాలలో పనిచేశాడు. 24 సంవత్సరాల వయస్సులో అతను చెన్నైకి వెళ్లి నేపాల్‌ కు వెళ్లడానికి ముందు అక్కడ మూడు సంవత్సరాలు నివసించాడు. అతను యూకే కి తిరిగి వచ్చిన అనంతరం గత సెప్టెంబర్‌ లో లండన్‌ లోని ఒక ప్రాథమిక పాఠశాలలో డిప్యూటీ ప్రధాన ఉపాధ్యాయునిగా పని చేయడం ప్రారంభించాడు.

ఈ విషయాలపై స్పందించిన నేషనల్ క్రైం ఏజెన్సీ... గ్లోబల్ పార్టనర్‌ లతో కలిసి పని చేస్తూనే ఉంటుందని.. పిల్లలకు రక్షణ కల్పించడంతోపాటు స్మిత్ వంటి నేరస్థులు న్యాయస్థానం ముందుకు తీసుకురాబడతారని స్పష్టం చేసింది.

Tags:    

Similar News