వారంలో మూడోది.. అమెరికాలో మన విద్యార్థి మృతి

అమెరికాలోని సిన్సినాటిలో ఒక భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు.

Update: 2024-02-02 04:22 GMT

అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అల్లారు ముద్దుగా పెంచుకొని.. ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపిస్తున్న తల్లిదండ్రుల ఆసక్తిని పక్కన పెడితే.. తాజాగా చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు షాకింగ్ గా మారాయి. భారత్ కు చెందిన విద్యార్థులు ఒకరు తర్వాత ఒకరు చొప్పున మరణిస్తున్నారు. తాజాగా అలాంటిదే మరో విషాద ఉదంతం వెలుగు చూసింది. అమెరికాలోని సిన్సినాటిలో ఒక భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మరో విషాదకరమైన అంశం ఏమంటే.. మూడు వారాల వ్యవధిలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మరణాల పాలు కావటం షాకింగ్ గా మారింది. ఎందుకిలా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఆ మద్యన వివేక్ సైనీ అనే పాతికేళ్ల కుర్రాడ్ని ఒక వ్యక్తి షాపులో పని చేస్తుండగా అతన్ని కొట్టి చంపారు. నిజానికి దాడికి కాస్త ముందు డ్రగ్స్ కు బానిసైన జూలియన్ ఫాల్క్ నర్ అనే నిరాశ్రయుడికి సైనీ సాయం చేసినా.. అతడ్ని హత్య చేయటం గమనార్హం.

ఇండియానా స్టేట్ లో పర్డ్యూ వర్సిటీలో చదివే భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య గత వారం ప్రాణాలు కోల్పోయాడు. గత వారం అతను శవమై కనిపించాడు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజీ ఆఫ్ పర్డ్యూ వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్న అతను. ఆదివారం నుంచి కనిపించట్లేదని.. సోషల్ మీడియాలో పేర్కొనగా.. తర్వాతి రోజుకు అతను శవమై కనిపించారు. ఈ ఉదంతం భారీ షాకిచ్చేలా మారింది. ఇక.. గత ఏడాది నవంబరులో ఆదిత్య అద్లాఖా అనే భారతీయ విద్యార్తి దారుణంగా హత్యకు గురయ్యాడు.

సిన్సినాటి వర్సిటీలో పీహెచ్ డీ చేస్తున్న ఆదిత్య.. ఒహియోలోని కారులో అతన్ని కాల్చి చంపారు. మరో కేసులో ఇల్లినాయస్ వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చదువుతున్న ఆకుల్ ధావన్ అనే భారత సంతతి యువకుడు ప్రాణాలు కోల్పోవటం షాకులు ఇచ్చేలా మారింది. ఇలా.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకుంటున్న మరణాలు ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. యూఎస్ లోని వరుస హత్యలపై ఆరా తీయాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News