విద్యార్థినిని గర్భవతిని చేసిన కీచక టీచర్‌!

కదిరి నియోజకవర్గానికి చెందిన ఒక బాలిక(16) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

Update: 2023-10-17 09:31 GMT

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థులకు మంచి చెడూ చెప్పాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు దారి తప్పుతున్నారు. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థినులపై అత్యాచారాలకు పాల్పడుతూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి తీవ్రమైన కళంకం తెస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. ఇల్లు తర్వాత పిల్లలు ఎక్కువ సేపు ఉండేది పాఠశాలల్లోనే. అలాంటి చోట్లే తమ పిల్లలు అత్యాచారాలకు గురవుతుండటంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఘోరం చోటు చేసుకుంది. కదిరి నియోజకవర్గానికి చెందిన ఒక బాలిక(16) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో తొమ్మిది నెలల క్రితం మంచినీళ్లు తాగడానికి ఉపాధ్యాయుల గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఒంటరిగా ఉన్న ఉపాధ్యాయుడు రెడ్డి నాగయ్య బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయంతో బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ఉపాధ్యాయుడు రెడ్డి నాగయ్య ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. అయితే దీన్ని బాలిక తాజాగా ప్రసవించేవరకు ఎవరూ కనిపెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

తాజాగా బాలికకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలిక మగ బిడ్డను ప్రసవించింది. బాధితురాలికి రక్తం తక్కువ ఉండడంతో వైద్యులు కదిరి ప్రాంతీయ వైద్యశాలకు రిఫర్‌ చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు ఉపాధ్యాయుడు రెడ్డి నాగయ్యను అదుపులోకి తీసుకున్నారు.

కదిరి డీఎస్పీ శ్రీలత అనంతపురం ఆసుపత్రిలో బాలికను పరామర్శించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News