రూ.300 కోట్లు : ఆస్తి కోసం మామ హత్య !

పురుషోత్తంకు రూ. 300 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వాటిని సొంతం చేసుకోవాలని కన్నేసింది. రూ.కోటితో హత్యకు ఒప్పందం కుదుర్చుకుని నిందితులకు కారు కొనేందుకు డబ్బులు ఇచ్చింది.

Update: 2024-06-13 02:30 GMT

ఆస్తి కోసం ఓ కోడలు పక్కా ప్లాన్‌తో మామగారిని హతమార్చింది. రూ.300 కోట్ల ఆస్తి కోసం పన్నిన కుట్ర మహారాష్ట్రలోని నాగపూర్ లో వెలుగులోకి వచ్చింది. అయితే ఆ కోడలు టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌ పనిచేస్తుండడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం 82 ఏళ్ల పురుషోత్తం పుట్టేవార్‌ని కోడలు అర్చన మనీష్ పుట్టేవార్ పక్కా ప్లాన్ ప్రకారం కారుతో ఢీకొట్టించి హతమార్చింది. ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావడంతో పోలీసులు కోడలును అరెస్టు చేశారు. ఈ హత్య వెనక రూ.1 కోటి సుపారీ ఉన్నట్లు తెలిసింది.

పురుషోత్తంకు రూ. 300 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వాటిని సొంతం చేసుకోవాలని కన్నేసింది. రూ.కోటితో హత్యకు ఒప్పందం కుదుర్చుకుని నిందితులకు కారు కొనేందుకు డబ్బులు ఇచ్చింది. కారుతో ఢీకొట్టి ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించాలని ప్రయత్నించి విఫలమయింది. పోలీసులు ఇద్దరు నిందితులు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్‌‌లతో డ్రైవర్ బాగ్దేతో పాటు అర్చనను అరెస్టు చేశారు. అర్చన భర్త మనీష్ డాక్టర్ కావడం విశేషం.

ఘటన జరిగిన రోజున సర్జరీ అయి కోలుకుంటున్న తన భార్య శకుంతలను చూసేందుకు పురుషోత్తం ఆసుపత్రికి వెళ్లాడని, తిరిగి వస్తున్న క్రమంలో ఆయన మీది నుండి కారు దూసుకువెళ్లింది. ఇది ఇలా ఉంటే టౌన్ ప్లానింగ్ విభాగంలో అర్చన అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. అక్రమ లే అవుట్లను ఆమె క్లియర్ చేశారని, అయితే ఒక రాజకీయ నాయకుడి అండతో తప్పించుకున్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News