1000 కోట్ల క్లబ్.. మనోళ్ళదే అసలు డామినేషన్
అయితే ఇప్పుడు తెలుగులో మరిన్ని పెద్ద చిత్రాలు రెడీ అవుతున్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వనున్నాయి.
బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు.. ఒకప్పుడు ఈ లెక్కల గురించి అంతా మాట్లాడుకునే వాళ్లం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మౌత్ టౌక్ బాగుంటే.. వేరే లెవెల్ లో వసూళ్లను సాధిస్తున్నాయి పెద్ద చిత్రాలు. రూ.1000 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టేందుకు ట్రై చేస్తున్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ప-2 ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు రూ.1000 కోట్ల క్లబ్ లోకి ఎనిమిది ఇండియన్ సినిమాలు చేరాయి. అందులో టాలీవుడ్ వే నాలుగు ఉన్నాయి. అంటే అక్కడ తెలుగు సినీ ఇండస్ట్రీ ఆధిపత్యం చలాయిస్తుందన్న మాట. ఆ నాలుగులో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు స్థానం సంపాదించుకున్నాయి.
ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ ఇటీవల చేరింది. రీసెంట్ గా సుకుమార్ రూపొందించిన పుష్ప-2 ఎంట్రీ ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఆ సినిమా ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. బాలీవుడ్ లో కూడా అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది.
అల్లు అర్జున్ యాక్టింగ్ పట్ల అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. రీసెంట్ గా ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కూడా పోస్ట్ పెట్టారు. పుష్ప-2 స్క్రిప్ట్ బాలీవుడ్ యాక్టర్లలో ఎవరి చేతికి వెళ్లి ఉన్నా కచ్చితంగా ఒప్పుకోరని లేకుంటే మార్పులు చేర్పులు చేస్తారని వ్యాఖ్యానించారు. అలా బన్నీ ప్రశంసిస్తూ బాలీవుడ్ పై కామెంట్ చేశారు!
అయితే బాలీవుడ్ లో పుష్ప సీక్వెల్ ఊచకోత కోస్తుందనే చెప్పాలి. అయితే ఒకప్పుడు తక్కువ చూపు చూసే బాలీవుడ్ పై టాలీవుడ్ ఇప్పుడు అనేక విషయాల్లో పై చేయి సాధిస్తోంది. ఇప్పుడు రూ.1000 కోట్ల క్లబ్ లో కూడా డామినేషన్ చూపిస్తోంది. బాలీవుడ్ కు చెందిన మూడు సినిమాలు దంగల్, జవాన్, పఠాన్ మాత్రమే ఉన్నాయి.
అందులో రెండు గత ఏడాది చేరాయి. వెయ్యి కోట్ల క్లబ్ లో కన్నడ మూవీ కేజీఎఫ్-2 కూడా ఉంది. కానీ ఆ సినిమాకు టాలీవుడ్, బాలీవుడ్ మార్కెట్స్ పెద్ద ఎత్తున మద్దతు పలకడంతో సాధ్యమయింది! కోలీవుడ్ ఇండస్ట్రీ అయితే ఆ ఫీట్ కు చాలా దూరంగా ఉంది. రీసెంట్ గా వచ్చిన కంగువా ఎంట్రీ ఇస్తుందనుకున్నా.. డిజాస్టర్ గా మారింది.
మొత్తానికి ఇప్పుడు రూ.1000 కోట్ల క్లబ్ లో టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుగులో మరిన్ని పెద్ద చిత్రాలు రెడీ అవుతున్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వనున్నాయి. దీంతో వెయ్యి కోట్ల క్లబ్ లో టాలీవుడ్ డామినేషన్ మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో..