రూ.20 కోట్ల బడ్జెట్ మూవీ రిలీజ్ కి 20 వేల థియేటర్లు!
ఈ సినిమాకు చైనాలో హిట్ టాక్ వస్తే కచ్చితంగా ఇక్కడ విడుదల అయిన వసూళ్లకు మూడు నాలుగు రెట్లు అధికంగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
భారీ బడ్జెట్ సినిమాలు డిజాస్టర్ లుగా మిగలడం, చిన్న బడ్జెట్ సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధించడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమాలు వందల కోట్ల వసూళ్లు రాబడితే పెద్ద విషయం ఏమీ కాదు. కానీ పది లేదా ఇరవై కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమాలు వందల కోట్లు వసూళ్లు చేస్తే అది అసలైన విజయం.
అలాంటి విజయం 12th ఫెయిల్ సినిమాకు దక్కింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వంద కోట్లకు పైగానే నిర్మాతలకు తెచ్చి పెట్టింది. ఇప్పుడు మరో అరుదైన ఘనతను ఈ సినిమా దక్కించుకుంది.
ఇండియన్ సినిమాలు చైనాలో చాలా అరుదుగా విడుదల అవుతూ ఉంటాయి. భారీ యాక్షన్ సినిమాలు లేదంటే ప్రత్యేకమైన సినిమాలు మాత్రమే చైనాలో విడుదల అవ్వడం మనం చూశాం. అయితే ఈసారి 12th ఫెయిల్ సినిమా చైనా బాక్సాఫీస్ వద్ద సందడికి సిద్ధం అయ్యింది.
చైనాలో ఏ సినిమా విడుదల అయినా వేల సంఖ్యల థియేటర్లలో విడుదల అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు 12th ఫెయిల్ మూవీ కూడా ఏకంగా 20 వేల థియేటర్లలో విడుదల కాబోతుందట. చిత్ర యూనిట్ సభ్యులు వారం రోజుల పాటు చైనాలో పర్యటించి ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొనబోతున్నారు.
ఈ సినిమాకు చైనాలో హిట్ టాక్ వస్తే కచ్చితంగా ఇక్కడ విడుదల అయిన వసూళ్లకు మూడు నాలుగు రెట్లు అధికంగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. విజువల్స్ పరంగా గ్రాండ్ గా ఉండకున్నా కూడా ఎమోషన్ మరియు పాయింట్ పరంగా చైనా వారిని మెప్పించే విధంగా 12th ఫెయిల్ మూవీ ఉంటుందని, కనుక కచ్చితంగా అక్కడ భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.