200 కోట్లు.. మన స్టార్స్ కు చాలా సింపుల్
చాలా ఈజీగా ఈ హీరోలు ఆ కలెక్షన్స్ ని సాధిస్తారు. అందరికంటే వేగంగా కేవలం రెండు లేదా మూడు రోజుల్లోనే 200 కోట్లు సాధించే సత్తా ఉన్న హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పాలి.
సౌత్ ఇండియాలో 200 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకోవడం చిన్న విషయం కాదు. కానీ ముగ్గురు హీరోలకి మాత్రం ఈ రెండు వందల కోట్లు అనేది చాలా చిన్న టార్గెట్ . చాలా ఈజీగా ఈ హీరోలు ఆ కలెక్షన్స్ ని సాధిస్తారు. అందరికంటే వేగంగా కేవలం రెండు లేదా మూడు రోజుల్లోనే 200 కోట్లు సాధించే సత్తా ఉన్న హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పాలి.
బాహుబలి మూవీ ప్రభాస్ కెరియర్ మొట్టమొదటి 200 కోట్ల కలెక్షన్స్ మూవీ. తరువాత బాహుబలి 2 మొదటి రోజే 200 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. సాహో రెండు రోజుల్లో ఈ ఫీట్ అందుకుంది. రాధేశ్యామ్ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో కొద్దిగా ఆలస్యం అయ్యింది. తాజాగా సలార్ మూవీ రెండు రోజుల్లోనే 200 కోట్లకి పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. దీంతో వరుస సినిమాలతో 200 కోట్ల క్లబ్ లో ఏకంగా ఐదు సార్లు చేరిన హీరోగా ప్రభాస్ నిలిచాడు.
నెక్స్ట్ ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఉంటారు. సౌత్ ఇండియాలో హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ తో ప్రభంజనం సృష్టించే హీరో అంటే ఎవరైనా రజినీకాంత్ పేరు చెబుతారు. అతని మూవీ రిలీజ్ అయ్యిందంటే అన్ని భాషలలో కూడా భారీ ఓపెనింగ్స్ వస్తాయి. తరువాత సక్సెస్ బట్టి కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు రజిని కెరియర్ లో పేట, దర్బార్, రోబో, 2.ఓ, కబాలి, జైలర్ సినిమాలు 200 కోట్ల క్లబ్ లో చేరాయి.
వీటిలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్నవి అంటే జైలర్, 2. ఓ సినిమాలు అని చెప్పాలి. ఇక 200 కోట్ల కలెక్షన్స్ ని చాలా ఈజీగా అందుకునే ఇంకో హీరో అంటే ఇళయదళపతి విజయ్ అని చెప్పాలి. విజయ్ కెరియర్ లో ఇప్పటి వరకు 7 సినిమాలు 200 కోట్లకంటే ఎక్కువ కలెక్షన్స్ ని సాధించాయి. మెర్సల్, సర్కార్, బిగిల్, మాస్టర్, బీస్ట్, వారిసు, లియో సినిమాలు 200 కోట్లకి పైగా కలెక్ట్ చేశాయి. వీటిలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీ అంటే లియో అని చెప్పాలి.
తరువాత 200 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన హీరోల జాబితాలో అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో, పుష్పలతో రెండు సార్లు, మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్యతో రెండు సార్లు, రామ్ చరణ్ రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రెండు సార్లు నిలిచారు. ఈ స్టార్స్ నెక్స్ట్ సినిమాలు కూడా రెండు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ టార్గెట్ తోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.