2023 రివైండ్.. టాలీవుడ్ హిట్టు బొమ్మలు

అయితే ఈ ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద తెలుగు చిత్రాల సందడి మూములుగా లేదు. దాదాపు ప్రతీ నెలలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి.

Update: 2023-12-22 08:40 GMT

మరో 9రోజుల్లో 2023 కంప్లీట్ అవ్వనుంది. 2024కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచమంతా రెడీ అవుతోంది. సినీ ప్రియులు కూడా కొత్త ఏడాదిలో తమ అభిమాన నటీనటుల చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద తెలుగు చిత్రాల సందడి మూములుగా లేదు. దాదాపు ప్రతీ నెలలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని సర్ప్రైజింగ్ హిట్లు అవ్వగా.. మరికొన్ని నిరాశపరిచాయి. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించిన సినిమాలతో హిట్ కొట్టిన చిత్రాలివే.

జనవరిలో బాలయ్య, చిరు హవా

2023 జనవరిలో టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సంక్రాంతి రేసులో పోటీ పడ్డారు. వాల్తేరు వీరయ్యతో చిరు ప్రేక్షకుల ముందుకు రాగా.. వీరసింహా రెడ్డితో బాలయ్య వచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలు మంచి వసూళ్లే సాధించాయి.

రెండో నెలలో మాస్టారూ...

ఆ తర్వాత నెలలో తమిళ హీరో ధనుశ్ నటించిన తెలుగు సినిమా సార్ భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా నిర్మాత‌లు సూర్య‌దేవ‌ర నాగవంశీ, సాయి సౌజ‌న్య‌ల పాటు డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి కూడా తెలుగువారే. అయితే ఫిబ్రవరిలో రిలీజైన మిగతా సినిమాలన్నీ ఫ్లాపే!

మార్చి అంతా బలగందే!

మార్చి నెలలో దిల్రాజు నిర్మాతగా కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌పై తెర‌కెక్కిన ఈ సినిమాకు దిల్ రాజు పెట్టిన బ‌డ్జెట్‌కు మూడు నాలుగింత‌లు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయ‌నే చెప్పాలి. ప‌ల్లెటూరులోని జ‌నాలంద‌రూ బ‌ళ్లు క‌ట్టుకుని వ‌చ్చి మ‌రీ సినిమాను చూశారు. అనేక అవార్డులను కూడా ఈ సినిమా గెలుచుకుంది. మరోవైపు, అదే నెలలో రిలీజైన నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా కూడా మంచి వసూళ్లు రాబట్టింది. నాని యాక్షన్కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.

ఏప్రిల్ లో మెగా అల్లుడి కమ్బ్యాక్- మేలో అన్నీ ఫ్లాపులే!

రోడ్ యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రంతో గ్రేట్ కమ్బ్యాక్ ఇచ్చారు. ఏప్రిల్లో విడుదలైన ఈ మూవీ.. ఏకంగా వంద కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ నెలలో రిలీజైన మరే సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. మే నెలలలో విడుదలైన సినిమాలన్నీ ఫ్లాప్ టాకే అందుకున్నాయి

జూన్లో శ్రీవిష్ణు!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన సామజవరగమన చిన్న మూవీగా విడుదలై భారీ విజయం సాధించింది. విడుదలకు ముందు కేవలం రూ.3కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. తర్వాత సినిమాపై పాజిటివ్‌ టాక్‌ రావడంతో దాని బిజినెస్‌ లెక్కలు మారిపోయాయి. కేవలం రూ.7కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ.50 కోట్లకు పైగానే రాబట్టింది. 2023లో ఇదో సర్ప్రైజింగ్ హిట్ మూవీ.

జులైలో బేబీదే రాజ్యం!

ఈ నెలలలో విడుదలైన బేబీ సినిమా సూపర్ సక్సెస్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ కల్డ్ క్లాసిక్ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య మంచి ఫేమ్ సంపాదించారు. ఆగస్ట్లో సినిమాలన్నీ నిరాశపరిచాయి.

సెప్టెంబర్లో శెట్టి హవా!

ఈ నెలలలో నవీన్ పోలిశెట్టి, టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మంచి టాక్ అందుకుంది. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా వసూళ్లు కూడా బాగానే సాధించింది.

అక్టోబర్లో బాలయ్య కేసరి!

అక్టోబర్లో మ్యాడ్ చిన్న మూవీగా రిలీజై భారీ వసూళ్లు సాధించిది. బాలయ్య భగవంత్ కేసరి కూడా దసరా కానుకగా విడుదలై మంచి వసూళ్లు రాబట్టి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజయ్ లియో సినిమా కూడా వసూళ్లు రాబట్టింది. నవంబర్లో కీడాకోలా, మంగళవారం చిత్రాలు యూత్ను ఆకట్టుకున్నాయి.

చివరి నెలలో ఫుల్ మూవీస్!

2023 చివరినెలలో డిసెంబర్లో రణ్బీర్ కపూర్ యానిమల్తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇంకా వసూళ్లు సాధిస్తూనే ఉంది. నాని హాయ్ నాన్న మూవీ కమర్షియల్ హిట్ అయింది. తాజాగా రిలీజైన ప్రభాస్ సలార్ సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. మంచి వసూళ్లు సాధిస్తోంది.

Tags:    

Similar News