అట్ట‌హాసంగా 69 జాతీయ పుర‌స్కారాలు..త‌గ్గేదిలే అంటూ పుష్ప‌రాజ్ సంద‌డి

పాన్ ఇండియా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'పుష్ప‌' చిత్రానికి గానూ బ‌న్నీ జాతీయ ఉత్త‌మ నటుడు పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్నారు.

Update: 2023-10-17 11:26 GMT

69వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఢిల్లీలో ఘ‌నంగా జ‌రుగుతోంది. దేశ వ్యాప్తంగా ప‌లు భాష‌ల‌కు సంబంధించిన చిత్రాలు ఈ అవార్డుల‌కు పోటీప‌డ్డాయి. ఈ అవార్డుల్లో తొలి సారి జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డును అందుకుంటున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీ స‌మేతంగా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో అత్యంత భారీ స్థాయిలో అట్ట‌హాసంగా జ‌రిగిన అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్ర‌దానం జ‌రిగింది.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన భారీ పాన్ ఇండియా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'పుష్ప‌' చిత్రానికి గానూ బ‌న్నీ జాతీయ ఉత్త‌మ నటుడు పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్నారు. దాదాపు 7 ద‌శాబ్దాల త‌రువాత తొలి సారి తెలుగు హీరోకు ద‌క్కిన గౌర‌వం కావ‌డంతో బ‌న్నీ చ‌రిత్ర సృష్టించాడు. బ‌న్నీ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు అందుకోగా 'మిమి' సినిమాకు గానూ కృతి స‌న‌న్ ఉత్త‌మ న‌టి అవార్డుకు ఎంపిక కావ‌డం తెలిసిందే. ఇక 'గంగూబాయి క‌తియావాడీ' సినిమాకు గానూ అలియాభ‌ట్ కూడా ఉత్త‌మ న‌టి అవార్డుని ద‌క్కించుకుంది.

ఈ అవార్డుల్లో తెలుగు నుంచి రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'ఆర్ ఆర్ ఆర్‌' మూవీ అత్య‌ధిక అవార్డుల్ని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా 'పుష్ప‌' సినిమాకు గానూ దేవి శ్రీ‌ప్ర‌సాద్ అవార్డుని ద‌క్కించుకోగా 'ఆర్ ఆర్ ఆర్' ఉత్త‌మ ప్ర‌జాద‌ర‌ణ పొందిన సినిమాతో పాటు ప‌లు విభాగాల్లో అత్య‌ధిక పుర‌స్కారాల్ని సొంతం చేసుకుంది. ఉత్త‌మ యాక్ష‌న్ (కింగ్ సాల‌మ‌న్‌), ఉత్త‌మ కొరియోగ్రఫీ (ప్రేమ్ ర‌క్షిత్ నాటు నాటు), ఉత్త‌మ ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిత్రం విభాగంలో రాజ‌మౌళి అవార్డు ని ద‌క్కించుకున్నారు. ఉత్త‌మ సంగీతంకు గానూ ఆర్ ఆర్ ఆర్ సినిమాకు కీర‌వాణి అవార్డు అందుకున్నారు. ఉత్త‌మ స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌కు గానూ శ్రీ‌నివాస మోహ‌న‌న్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇలా 'ఆర్ ఆర్ ఆర్‌'కు ఆరు పుర్కారాలు ద‌క్కాయి.

ఈ సంద‌ర్భంగా నేష‌ణ‌ల్ అవార్డుపై అల్లు అర్జున్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 'జాతీయ పుర‌స్కారం అందుకోబోతుండ‌టం ఆనందంగా ఉంద‌న్నారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు నేష‌న‌ల్ అవార్డు రావ‌డం అనేది డ‌బుల్ ఎచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాన‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా రెడ్ కార్పెట్‌పై బ‌న్నీ త‌గ్గేదేలే అంటూ త‌న‌దైన స్టైల్లో పుష్ప డైలాగ్ చెప్పి అల‌రించారు. దీనికి సంబంధించిన వీడియోని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేయ‌గా అది నెట్టింట వైర‌ల్ అవుతోంది. అంతే కాకుండా బ‌న్నీ ఉత్త‌మ న‌టుడిగా జాతీయ పుర‌స్కారం అందుకున్న వీడియో కూడా ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

రాజ‌మౌళి మాట్లాడుతూ 'నా తొలి ల‌క్ష్యం ప్రేక్ష‌కుల కోసం సినిమాలు తీయ‌డ‌మే. అవార్డ‌లు నాకు బోన‌స్ లాంటివి. అయితే జాతీయ స్థాయిలో అవార్డు రావ‌డం అది కూడా ఆరు అవార్డులు గెలుచుకోవ‌డం అంటే నా సినిమాలోని టెక్నీషియ‌న్లు, వాళ్ల మూడేళ్ల శ్ర‌మ‌ను గుర్తించిన‌ట్టే, చాలా చాలా సంతోషంగా ఉంది' అన్నారు. ఈ వెంట్‌లో విశేషం ఏంటంటే అల్లు అర్జున్ జాతీయ ఉత్త‌మ న‌టుడిగా పుర‌స్కారం అందుకుంటున్న స‌న్నివేశాన్ని బాలీవుడ్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ త‌న ఫోన్‌లో స‌గ‌టు ప్రేక్ష‌కుడిలా బంధించ‌డం, ఆక్ష‌ణాల్ని సైలెంట్‌గా చూస్తూ అల్లు అర‌వింద్ మురిసిపోయి పుత్రోత్సాహంతో పొంగిపోవ‌డం.

Tags:    

Similar News