7 నిమిషాల కామియోకి 565 కోట్ల పారితోషికం?

స్టార్ రేంజ్ గురించి చెప్ప‌డానికి ఇది ఒక ఉదాహ‌ర‌ణ‌. స‌ద‌రు స్టార్ హీరో పేప్యాకేజీ క‌ళ్లు భైర్లు క‌మ్మేలా ఉంది మ‌రి.

Update: 2024-01-01 04:00 GMT

స్టార్ రేంజ్ గురించి చెప్ప‌డానికి ఇది ఒక ఉదాహ‌ర‌ణ‌. స‌ద‌రు స్టార్ హీరో పేప్యాకేజీ క‌ళ్లు భైర్లు క‌మ్మేలా ఉంది మ‌రి. కేవ‌లం 7 నిమిషాల కామియోకి 565 కోట్ల (68 మిలియ‌న్ డాల‌ర్లు) పారితోషికం అందుకున్నాడంటే అత‌డు ఎంత పెద్ద స్టార్ అన్న‌ది ఊహించ‌గ‌లం. ఒక‌వేళ పూర్తి సినిమాలో న‌టిస్తే అత‌డి ప్యాకేజీ ఇంకే స్థాయిలో ఉంటుందో..! ఇంత‌కీ ఎవ‌రా న‌టుడు? అంటే.. పాపుల‌ర్ హాలీవుడ్ స్టార్ జానీ డెప్ గురించే ఇదంతా.

జానీ డెప్ పెద్ద తెర‌పై చమత్కారమైన పాత్రలను పోషించడంలో పాపుల‌ర్. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ ఫ్రాంచైజీలో అతడు కెప్టెన్ జాక్ స్పారో, ఎడ్వర్డ్ సిజర్‌హ్యాండ్స్ లేదా చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీలో విల్లీ వోంకా అయినా అతను వాటిని ఐకానిక్ ఎలివేష‌న్ వ‌చ్చేలా చేసాడు. 2000 ద‌శ‌కంలో జానీ డెప్ తన కెరీర్‌లో అత్యుత్త‌మ‌ స్టార్ డ‌మ్‌కి చేరుకున్నాడు. అతడిని ఒక పాత్ర కోసం తీసుకోవడానికి నిర్మాతలు మిలియన్ల డాల‌ర్లు చెల్లించడానికి వెనుకాడలేదు. ప్రత్యేకించి అది ఒక ఫాంటసీ చిత్రం అయితే కేవ‌లం కొన్ని నిమిషాల అతిథి పాత్ర‌కు కూడా మిలియ‌న్ల డాల‌ర్లు చెల్లించారు. ఆలిస్ ఇన్ వండర్‌ల్యాండ్‌లో తన పాత్ర కోసం అతడు అత్యంత భారీ మొత్తాన్ని పారితోషికంగా అందుకున్నాడు.

హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో జానీ డెప్ ఒక‌రిగా కొన‌సాగుతున్నారు.. అందుకు కారణం! అతను బహుముఖ ప్ర‌తిభావంతుడైన నటుడు. అతడు తెర‌పై కనిపించే ప్రతి పాత్రకు చాలా గొప్ప ఎలివేష‌న్‌ను తెస్తాడు. అయితే అత‌డి వ్య‌క్తిగ‌త కుటుంబ‌ జీవితంలో క‌ల‌త‌లు కొంత‌కాలం ఇబ్బంది పెట్టాయి. మాజీ భార్య, అంబర్ హర్డ్ అత‌డు గృహహింసకు పాల్పడ్డాడని ఆరోపించినప్పుడు స‌న్నివేశం అధ్వాన్నంగా మారింది. డిస్నీ అతన్ని కెప్టెన్ స్పారో పాత్ర నుండి తొలగించింది. అతడు ఫెంటాస్టిక్ బీస్ట్స్ ఫ్రాంచైజీని కూడా కోల్పోయాడు.

పాపుల‌ర్ దర్శకుడు టిమ్ బర్టన్‌తో జానీ డెప్ అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆలిస్ ఇన్ వండర్‌ల్యాండ్‌ సహా ఈ ద్వయం నుంచి కొన్ని అద్భుతమైన సినిమాలు వ‌చ్చాయి. మియా వాసికోవ్స్కా ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్‌కి ఆలిస్ అనే పేరు పెట్టారు. హెలెనా బోన్‌హామ్ కార్టర్ రెడ్ క్వీన్‌గా అన్నే హాత్వే వైట్ క్వీన్‌గా నటించారు. డెప్ మ్యాడ్ హాట్టర్ పాత్రలో సరిగ్గా సరిపోతాడు. ఒక గంట నలభై ఎనిమిది నిమిషాల సినిమాలో దాదాపు ఏడు నిమిషాల పాటు తెర‌పై య‌క‌నిపించాడు.

ప్ర‌ఖ్యాత టెలిగ్రాఫ్ క‌థ‌నం ప్రకారం.. టిమ్ బర్టన్ తెర‌కెక్కించిన ఆలిస్ ఇన్ బోర్డర్‌ల్యాండ్‌లో మ్యాడ్ హాట్టర్ పాత్ర పోషించినందుకు జానీ డెప్‌కు 50 మిలియన్ పౌండ్లు చెల్లించారు. ఇది దాదాపు 68 మిలియన్ అమెరికన్ డాలర్లకు స‌మానం. అతడు నిమిషానికి దాదాపు 9 మిలియన్ డాల‌ర్ల‌కు పైగా సంపాదించాడు. హాలీవుడ్‌లో ఇంత తక్కువ స్క్రీన్ సమయానికి అత్యధిక చెల్లింపులలో ఇది ఒకటి. 2016లో జానీ డెప్ సీక్వెల్ `ఆలిస్ త్రూ ది లుకింగ్ గ్లాస్‌`లో తన పాత్రను తిరిగి పోషించాడు. అదే సంవత్సరంలో హాలీవుడ్‌లో అత్యధికంగా చెల్లించే A-లిస్టర్ నటుల ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అతడు 2015లో పరేడ్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.

జానీ డెప్ హియర్డ్‌పై పరువు నష్టం కేసు గెలిచిన తర్వాత పీరియడ్ డ్రామా జీన్ డు బారీతో తిరిగి ప‌ని చేసాడు. ఈ చిత్రం ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిత‌మైంది. ప్రేక్షకుల నుండి ఏడు నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ లో ఓ సినిమా పోస్టర్ వైరల్ గా మారింది. ఇది పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ 6 కి సంబంధించిన అధికారిక ప్రకటన. ఈ చిత్రానికి Pirates of the Caribbean: Demons of the Corsair అని పేరు పెట్టార‌ని 2025లో విడుదల కానుందని ఈ ప్ర‌క‌ట‌న‌ పేర్కొంది. కానీ ఇది బూట‌క ప్ర‌చార‌మ‌ని తెలియ‌డంతో ప్రతి ఒక్కరూ నిరాశ‌కు గుర‌య్యారు.


Tags:    

Similar News