8 వసంతాలు టీజర్… మార్షల్ ఆర్ట్స్ తో పవర్ఫుల్ అమ్మాయి

ఆ అమ్మాయి లైఫ్ లో మార్షల్ ఆర్ట్స్, భగవద్గీత, లవ్, లైఫ్, సంతోషం, బాధ వంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ అండ్ ఎమోషన్స్ ని టీజర్ ని ఆవిష్కరించారు.

Update: 2024-10-12 08:13 GMT

మంచి కథలు ఎప్పుడు మన మధ్యలోనే ఉంటాయి. వాటిని తెరపై చూపించే విధానం బట్టి ఆ కథకి విలువ పెరుగుతుంది. అప్పుడప్పుడు అందమైన కవితలా అనిపించే కథలు ప్రేక్షకుల ముందుకొస్తూ ఉంటాయి. అవి ఎవర్ గ్రీన్ చిత్రాలుగా నిలిచిపోతాయి. ఈ మధ్యకాలంలో అలాంటి కవితాత్మక చిత్రం అంటే అందరికి గుర్తుకొచ్చేది ‘సీతారామం’. అందులో ఒక ప్రేమ కథని దర్శకుడు హను రాఘవపూడి చెప్పారు.

అయితే స్త్రీలో ఒక సౌందర్యాన్ని చాలా మంది చూస్తారు. అంతకు మించి చూడగలిగితే ఆడవారిలో ఎన్నో భావోద్వేగాలు కనిపిస్తాయి. ‘8 వసంతాలు’ సినిమాతో అలాంటి భావోద్వేగాల్ని ప్రేక్షకులకి పరిచయం చేసే ప్రయత్నం ఫణీంద్ర నర్సెట్టి చేస్తున్నట్లు కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో సుద్ధి అయోధ్య క్యారెక్టర్ టీజర్ ని తాజాగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

మార్షల్ ఆర్ట్స్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఉన్న వారి మధ్యలో ఒక యువకుడు మరో ఫైట్ చేస్తాడు. ఆమెని ఓడిస్తాడు. మరో అమ్మాయి అతన్ని నిలువరించే ప్రయత్నం చేస్తుంది. నేను ఆడవాళ్ళతో ఫైట్ చేయను… మీ బాడీ వీక్ గా ఉంటుంది. దానిని నేను అడ్వాంటేజ్ గా తీసుకోలేను అని అంటాడు. వెళ్లి ఏ కుకింగ్ లోనో, ఎంబ్రాయిడరీ లోనో పోటీ పడు అంటూ ఆమెకి సలహా ఇస్తాడు. మార్షల్ ఆర్ట్స్ మగవారికి సంబందించింది అంటూ చులకనగా మాట్లాడుతాడు.

రేపు ఒక అమ్మాయి వస్తుంది. దాని పేరు సుద్ధి అయోధ్య. దానితో ఆడి.. నిలబడి అప్పుడు చెప్పు మార్షల్ ఆర్ట్స్ మగాళ్ళకి సంబందించినది అని అంటూ వాడికి కౌంటర్ ఇస్తుంది…. ఈ డైలాగ్ తర్వాత సుద్ధి అయోధ్యగా అనంతిక సునీల్ కుమార్ ని టీజర్ లో పరిచయం చేశారు. ఆ అమ్మాయి లైఫ్ లో మార్షల్ ఆర్ట్స్, భగవద్గీత, లవ్, లైఫ్, సంతోషం, బాధ వంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ అండ్ ఎమోషన్స్ ని టీజర్ ని ఆవిష్కరించారు.

అందాన్ని దాటి చూడగలిగితే ఆడదానిలో ఒక సముద్రమే కనబడుతుంది… అనే డైలాగ్ తో టీజర్ లో సుద్ధి అయోధ్య లైఫ్ స్టొరీని దర్శకుడు రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఒక అమ్మాయి జీవితంలో 8 సంవత్సరాల కాలాన్ని ‘8 వసంతాలు’ మూవీగా తెరపై చూపించబోతున్నట్లు టీజర్ బట్టి అర్ధమవుతోంది. ఇక ఈ టీజర్ కి హేసమ్ అబ్దుల్ వాహబ్ అందించిన మెలోడీ మ్యూజిక్ కూడా సిచువేషన్స్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసేలా ఉండటం విశేషం.

టీజర్ చూస్తుంటే ఇప్పటి వరకు ఎవ్వరు టచ్ చేయని కొత్త పాయింట్ ని దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి ఈ చిత్రంలో చూపించబోతున్నాడని అర్ధమవుతోంది. ఇలాంటి కథలని కరెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసే విధంగా ఉందని చెప్పాలి.

Full View
Tags:    

Similar News