యంగ్ డైరెక్టర్ తో మైత్రి '8 వసంతాలు'

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. స్టార్ హీరోలు, డైరెక్టర్లతో సూపర్ హిట్ సినిమాలు తీస్తోంది

Update: 2024-02-14 07:07 GMT
యంగ్ డైరెక్టర్ తో మైత్రి 8 వసంతాలు
  • whatsapp icon

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. స్టార్ హీరోలు, డైరెక్టర్లతో సూపర్ హిట్ సినిమాలు తీస్తోంది. అతి తక్కువ కాలంలో ప్రేక్షకుల్లో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి. ఓవైపు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్.. మరోవైపు కంటెంట్ రిచ్ సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తోంది.


మైత్రీ సంస్థ ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ కు కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ లోకి ప్రవేశించి మార్క్ ఆంథోని ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్ తదుపరి చిత్రాన్ని నిర్మిస్తోంది. సమ్మర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే చెన్నైలో మైత్రీ సంస్థ తమ కార్యాలయాన్ని ప్రారంభించిందని సమాచారం.

తాజాగా మైత్రీ సంస్థ.. లవర్స్ డే సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. నిజానికి నిన్న రాత్రి సోషల్ మీడియాలో వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక సర్ప్రైజ్ ఇస్తామని ప్రకటించింది. అది చూసిన సినీ ప్రేమికులు అందరూ ఏదో భారీ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందేమో అనుకున్నారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా మను సినిమా డైరెక్టర్ తో యూత్ ఫుల్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది.

లెజెండరీ హాస్యనటుడు బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా ఆరేళ్ల క్రితం వచ్చిన సినిమా మను. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ ను విపరీతంగా ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు పలు పురస్కారాలు సొంతం చేసుకుంది. ఆ సినిమా దర్శకుడు ఫణీంద్రతో మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు 8 వసంతాలు మూవీ తెరకెక్కిస్తోంది.

'365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం. అదే అనుభవాలతో కొలిస్తే... ఒక వసంతం' అంటూ 8 వసంతాలు మూవీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఇద్దరు ప్రేమికుల మధ్య 8 ఏళ్లలో జరిగిన ఘటనల సమాహారమే ఈ సినిమా కథ అని చెప్పారు. న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఎర్ర గులాబీతో కూడిన టైటిల్ పోస్టర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్.

Tags:    

Similar News