ఐదేళ్ల శ్రమకు దక్కిన అరుదైన గౌరవం..!

విక్రాంత్ మస్సే, మేధా శంకర్ లీడ్ రోల్ లో నటించిన ట్వెల్త్ ఫెయిల్ సినిమాను విదు వొనోద్ చోప్రా డైరెక్ట్ చేశారు.

Update: 2024-09-28 03:44 GMT

వెండితెర మీద బయోగ్రఫీ లకు మంచి క్రేజ్ ఏర్పడింది. కొందరి స్ఫూర్తిదాయకమైన జీవిత కథలను దృశ్యరూపంగా తెరకెక్కిస్తున్న సినిమాలు ప్రేక్షకులను రంజింప చేస్తున్నాయి. కేవలం కమర్షియల్ సినిమాలే కాదు స్పూర్తి దాయకమైన సినిమాలు కూడా ఆదరిస్తారని ప్రూవ్ చేశారు. ఇంతకీ ఏ సినిమా గురించి ఈ లీడ్ అంతా అంటే ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా చేసిన ట్వెల్త్ ఫెయిల్ సినిమా గురించి అన్నమాట. విక్రాంత్ మస్సే, మేధా శంకర్ లీడ్ రోల్ లో నటించిన ట్వెల్త్ ఫెయిల్ సినిమాను విదు వొనోద్ చోప్రా డైరెక్ట్ చేశారు.

ప్రేక్షకులు ఎంతగానో మెచ్చిన ఈ సినిమాను లేటెస్ట్ గా సుప్రీంకోర్టు లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కోసం ఈ సినిమా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఇతర న్యాయవాదులు, సుప్రీంకోర్టు అధికారులు వారి ఫ్యామిలీస్ అంతా పాల్గొన్నారు. ట్వెల్త్ ఫెయిల్ చిత్ర యూనిట్ కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొన్నారు. సినిమా చూసిన తర్వాత సీజేఐ చిత్ర యూనిట్ ను మెచ్చుకున్నారు. ఇది ఒక స్పూర్తిదాయకమైన సినిమా అని ప్రశంసించారు.

ప్రజల కోసం చేసే ఇలాంటి సినిమాలు అందరిలో స్పూర్తిని నింపుతాయి. విక్రాంత్, మేధా శంకర్ చాలా బాగా నటించారు. వారికి ఇచ్చిన పాత్రల్లో ఒదిగిపోయారని అన్నారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు తన కళ్లు చెమర్చేలా చేశాయని అన్నారు చీఫ్ జస్టిస్. ట్వెల్త్ ఫెయిల్ గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఇలాంటి గొప్ప సినిమా అందించినందుకు చిత్ర యూనిట్ కు ధన్యవాదాలు అని సీజేఐ ప్రశంసించారు.

ఐతే ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొన్న డైరెక్టర్ విదు వినోద్ చోప్రా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జీవితంలో ఇవి అందమైన క్షణాలు.. చీఫ్ జస్టిస్ తో కలిసి సినిమా చూడటం సంతోషంగా ఉంది. తాను పడిన ఐదేళ్ల శ్రమ ఆయన చెప్పిన ఈ మాటలతో విలువ దక్కినట్టు అయ్యిందని అన్నారు.

విజయం సాధించిన వారి జీవిత పాఠాలు కొందరికి ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా ట్వెల్త్ ఫెయిల్ సినిమాలో తాను కన్న కలను సాధించుకునేందుకు మనోజ్ కుమార్ శర్మ ఎంతగా కష్టపడ్డారు అన్నది చాలా గొప్పగా చూపించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచే కాదు అన్ని వర్గాల నుంచి గొప్ప ప్రశంసలు అందాయి.. ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News