ఐశ్వ‌ర్యారాయ్ కుమార్తె.. షారూఖ్ కొడుకు స్టేజీ డ్రామా

గత నెలలో కుమార్తె ఆరాధ్య బచ్చన్ పుట్టినరోజు వేడుక‌ల‌లో అభిషేక్ క‌నిపించ‌క‌పోవ‌డంతో బాలీవుడ్ మీడియాలో చాలా ఊహాగానాలు సాగాయి.

Update: 2024-12-20 09:58 GMT

గత నెలలో కుమార్తె ఆరాధ్య బచ్చన్ పుట్టినరోజు వేడుక‌ల‌లో అభిషేక్ క‌నిపించ‌క‌పోవ‌డంతో బాలీవుడ్ మీడియాలో చాలా ఊహాగానాలు సాగాయి. ఐశ్వ‌ర్యారాయ్- అభిషేక్ విడివిడిగా ఉన్నార‌ని పుకార్లు షికార్ చేసాయి. కానీ ఆరాధ్య పుట్టినరోజు వేడుకల్లో అభిషేక్ పాల్గొన్నార‌ని తర్వాత వెడైంది. ఇప్పుడు చాలా ఊహాగానాల‌కు చెక్ పెడుతూ ఆరాధ్య స్కూల్ వార్షికోత్స‌వ వేడుక‌ల్లో అభిషేక్- ఐశ్వ‌ర్యారాయ్ జంట‌గా పాల్గొన్నారు. ఒక‌రి చేయి ఒక‌రు క‌లిపి ఉత్స‌వాల్లో సంద‌డి చేసారు. ఐశ్వ‌ర్యారాయ్ కి అభి అంగ‌ర‌క్ష‌కుడిగా క‌నిపించాడు. వేదిక వ‌ద్ద త‌మ‌ కుమార్తె ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించిన త‌ల్లిదండ్రులు త‌మ క‌ళ్ల‌లో ఆనందాన్ని దాచుకోలేదు. గత రాత్రి బచ్చన్‌లు ఆరాధ్య‌ పాఠశాల అయిన ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షిక దినోత్సవ కార్యక్రమంలో దృశ్యాలివి. అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్య ఈ వేదిక వ‌ద్ద న‌వ్వులు చిందిస్తూ క‌నిపించారు.

ఐశ్వర్యరాయ్ తన మామగారిని లోపలికి తీసుకువెళ్ళి, అత‌డి చేతిపై చేయి వేసి పరిపూర్ణమైన కోడ‌లిగా క‌నిపించింది. మరోవైపు అభిషేక్ భార్య వెనుక న‌డుస్తూ నేల‌పై జారిన‌ దుపట్టాను మోస్తూ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ వేడుక‌ నుండి వైరల్ అయిన మ‌రో క్లిప్‌లో అభిషేక్ -ఐశ్వర్య సగర్వంగా గారాల‌ప‌ట్టీ ఆరాధ్య స్టేజీ షోను ఫోన్‌లో రికార్డ్ చేస్తూ క‌నిపించారు. ఆరాధ్య కింగ్ ఖాన్ షారూఖ్ కుమారుడు అబ్‌రామ్ ఖాన్ తో క‌లిసి వేదిక‌పై ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే అభిమానులు కొన్ని నెలలుగా వైర‌ల్ అయిన అన్ని వార్త‌ల‌కు చెక్ పెట్టిన‌ట్ట‌యింద‌ని భావిస్తున్నారు.

అభిషేక్- ఐశ్వ‌ర్యారాయ్ క‌లిసే ఉన్నారు. వారి బంధంలో ఎలాంటి స‌మ‌స్యా లేద‌ని నెటిజ‌నులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ``ఐశ్వర్యరాయ్ చాలా మంచి మహిళ. ఆమె భర్త, కుటుంబాన్ని గౌరవిస్తుంది. సంప్రదాయాలను విడిచిపెట్ట‌దు! అందుకే ప్రపంచం మొత్తం ఆమెను గౌరవిస్తుంది!`` ఒక ఒక అభిమాని వ్యాఖ్యానించారు. 51 ఏళ్ళ వయసులో ఒక్క ముడత కూడా లేకుండా క‌నిపిస్తోంది.. ఐష్‌ బరువు తగ్గుతుంది.. అందంగా క‌నిపిస్తోంద‌ని ఒక అభిమాని ప్ర‌శంసించారు. స్కూల్ యాన్యువ‌ల్ డే వేడుక ఐష్‌-అభి పై ఉన్న అన్ని రూమ‌ర్ల‌కు చెక్ పెట్ట‌డం సంతోషం క‌లిగిస్తోంది.

Full View
Tags:    

Similar News