ఆయ్.. ఆ సెన్సారోళ్లు ఏమిచ్చారంటే..?

ఇప్పుడు అలాంటి ఒక ప్రయత్నం తో వస్తున్న సినిమా ఆయ్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ సినిమాను అంజి కంచి పల్లి డైరెక్ట్ చేశారు.

Update: 2024-08-08 12:58 GMT

ఒక కొత్త సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే సినిమాలో ఏదైనా కొత్త కంటెంట్ ఉండాలి.. కంటెంట్ ఎంత బాగున్నా దాన్ని ప్రేక్షకుల్లో తీసుకెళ్లే ప్రమోషనల్ ట్రిక్ ఉండాలి.. ఇవన్నీ కుదిరినా సరే థియేటర్ కి వచ్చాక ప్రేక్షకులను మెప్పించే కథ కథనాలు ఉండాలి.. దాన్ని మోసే నటీనటులు ఉండాలి. సినిమా రిచ్ నెస్ అనేది బడ్జెట్ లోనూ కమర్షియల్ హంగుల్లోనూ కాదు ప్రేక్షకుల మనసును దోచేయడంలో ఆ హై ఉంటుంది. ఇదే ఫార్ములాతో మీడియం బడ్జెట్ సినిమాలు.. లో బడ్జెట్ సినిమాలు ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తమ సినిమాలను వదులుతుంటారు.

 

ఇప్పుడు అలాంటి ఒక ప్రయత్నం తో వస్తున్న సినిమా ఆయ్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ సినిమాను అంజి కంచి పల్లి డైరెక్ట్ చేశారు. ఎన్ టీ ఆర్ బామ్మర్ది నితిన్ నార్నే లీడ్ రోల్ లో నటించగా నయన్ సారికా ఫిమేల్ లీడ్ గా చేసింది. ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఆయ్ ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ అని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

కోనసీమలో జరిగిన ఒక అందమైన ప్రేమ కథ.. అందులోనూ విలేజ్ లో జరిగే ఫన్ వీటిని కలుపుతూ డైరెక్టర్ అంజి చేసిన ప్రయత్నమే ఈ ఆయ్. మ్యాడ్ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ ఈసారి కూడా ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకోవాలని ఈ ఆయ్ తో వస్తున్నాడు. ఆయ్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోగా సెన్సార్ టీం ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

ఆయ్ ట్రైలర్ కూడా ఆడియన్స్ ని మెప్పించగా సినిమా తప్పకుండా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేస్తుందని అంటున్నారు. ఆగష్టు 15న రెండు మాస్ సినిమాల మధ్య ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా ఆయ్ రిలీజ్ అవుతుంది. సినిమా ట్రైలర్ లో ఉన్నట్టుగానే ఉంటే మాత్రం ఆడియన్స్ కు రిఫ్రెష్మెంట్ కామెడీతో ఆహ్లాదకరం గా ఉంటుందని అనిపిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ కాబట్టి రిలీజ్ కూడా బాగానే ఉంటుంది. మరి టఫ్ ఫైట్ లో వస్తున్న ఆయ్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News