జాతీయ అవార్డు కాశ్మీరీ పండిట్లకు: నిర్మాత అభిషేక్
ఈ అవార్డు కాశ్మీరీ పండిట్లకు దక్కుతుందని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ''నేను భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ఆగస్టు 24న న్యూఢిల్లీలో ప్రకటించారు. తెలుగు సినిమాకు ఏకంగా 11 జాతీయ అవార్డులు దక్కగా, కన్నడ సినిమా 4 జాతీయ అవార్డులు గెలుచుకుంది. విజేతలకు నెటిజనులు సహా అభిమానులు సహచరుల నుంచి గొప్ప ప్రశంసలు దక్కాయి. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్.. కోలీవుడ్ నుంచి మాధవన్ (రాకెట్రీ దర్శకుడు) లకు గొప్ప గౌరవం గుర్తింపు దక్కింది.
ఇకపోతే బాలీవుడ్ సినిమా ది కాశ్మీర్ ఫైల్స్ కి జాతీయ అవార్డుల్లో సముచిత గౌరవం దక్కింది. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం జాతీయ సమగ్రత సమైక్యతకు సహకరించిన ఉత్తమ చలనచిత్రంగా నర్గీస్ దత్ అవార్డును గెలుచుకుంది.
నిజానికి ఈ చిత్రాన్ని విడుదల చేసిన ప్రముఖ పంపిణీదారు నిర్మాత అభిషేక్ అగర్వాల్ తాజాగా స్పందించారు. ఈ అవార్డు కాశ్మీరీ పండిట్లకు దక్కుతుందని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ''నేను భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.
ఈ అవార్డు భారత పౌరులకు, కాశ్మీరీ పండిట్లకు దక్కాలి. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కృషికి ఈ అవార్డు దక్కింది. ప్రజలు ఈ చిత్రాన్ని నిజం అని అంగీకరించారు. కాబట్టి దీనిని రాజకీయం చేయకూడదు''అని నిర్మాత అభిషేక్ అన్నారు. అయితే మతతత్వాన్ని చూపించిన సినిమాకి జాతీయ సమైక్యత సమగ్రతా పురస్కారం ఎలా ఇస్తారని పలువురు రాజకీయనాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు.