తల్లితో ఆ హీరోయిన్ కి గొడవొచ్చిందా?
అవసరం మేర లుక్ పరంగా రకరకాల మార్పులు తీసుకొచ్చింది.
తొమ్మిదేళ్ల క్రితం టాలీవుడ్ కి మెరుపులా దూసుకొచ్చింది ఓ బ్యూటీ. తొలి సినిమాతోనే గ్రాండ్ విక్టరీ అందుకుంది. దీనికితోడు అందం..అభినయం అన్ని కలిసొచ్చేసరికి అమ్మడికి పరిశ్రమ బాగానే అవకాశాలు కల్పించింది. ఆరేడేళ్ల పాటు వెనక్కి తిరిగి చూడకుండా కెరీర్ సాగిపోయింది. సక్సెస్ తో పనిలేకుండా అవకాశాలు అందుకున్న బ్యూటీగానూ ఫేమస్ అయింది. అవసరం మేర లుక్ పరంగా రకరకాల మార్పులు తీసుకొచ్చింది.
కోలీవుడ్ ప్రయత్నాలు చేసిందిగానీ అక్కడ నిలబడలేకపోయింది. ఇక తెలుగులో ఇప్పుడా వేగం ఏమాత్రం కనిపించడం లేదు. మూడేళ్లగా ఏడాదికో సినిమా చొప్పున చేసుకుంటూ వచ్చింది. కొత్త ఏడాదిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా సంతకం చేయలేదు. దీంతో ఆ హీరోయిన్ ఏమైపోయింది? అన్న అంశం చర్చకొస్తుంది. ఉన్నట్లుండి ఇలా మాయం అయిందేంటని ఇండస్ట్రీ వర్గాల్లో సైతం చర్చకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
ఆ హీరోయిన్ కి- ఆమె తల్లికి మధ్య గత ఏడాది ఓ పెద్ద గొడవ జరిగిందిట. వివాదం ఎందుకు వచ్చిందన్నది తెలియదుగానీ అప్పటి నుంచి సదరు హీరోయిన్ టాలీవుడ్ లో కనిపించలేదంటున్నారు. ఇతర భాషల్లో కూడా ఆమె కనిపించకపోయేసరికి కుమార్తె కెరీర్ పరంగా ఇద్దరి మధ్య విబేధాలు ఏమైనా తలెత్తాయా? అన్న సందేహం వ్యక్తం అవుతోంది. ఆహీరోయిన్ కొత్తగా పరిశ్రమకి వచ్చినప్పుడు వెంట తల్లి ఉండేది.
ఏ సినిమా షూటింగ్ జరిగినా అక్కడ కనిపించేది. నిత్యం కుమార్తెను అంటిపెట్టుకునే ఉండేది. సాధారణంగా చాలా మంది హీరోయిన్ల కుమార్తెలు హీరోయిన్ల వెంట ఉంటారు. అది కొంత కాలమే. పరిశ్రమ అలవాటు అయిన తర్వాత అంతా తెలిసిన వారు అయిన తర్వాత ఓ ధీమాతో వదిలి వెళ్తారు. కానీ ఈ హీరోయిన్ విషయంలో మాత్రం అతిగానే ఆ తల్లి వ్యవహరిస్తుందనే విమర్శ అప్పుడే తెరపైకి వచ్చింది. అదే ఇద్దరి మధ్య మళ్లీ ఇప్పుడు వివాదానికి దారి తీసిందా? అని ఫిలిం సర్కిల్స్ లో చర్చకొస్తుంది.