విశ్వంభర సెట్ లో భారీ యాక్షన్!
మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం `విశ్వంభర` శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం `విశ్వంభర` శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగైదు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. మొత్తంగా చిత్రీకరణలో భాగంగా 70శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. షూటింగ్ అంతా దాదాపు సెట్స్ లో నే చేస్తున్నారు. సోషియా ఫాంటసీ సినిమా కాడంతో షూట్ అంతా సెట్స్ కే పరిమితమవుతుంది. ఔట్ డోర్ షూటింగ్ చాలా తక్కువగా ఉంది. కీలక సన్నివేశాల్లో భాగంగా షూటింగ్ అంతా హైదరాబాద్ లోని వివిధి లొకేషన్లలో సెట్లు నిర్మించి చేస్తున్నారు.
తాజాగా సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇటీవలే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభమైంది. అందుకోసం పాత సెట్లతో పనిలేకుండా ప్రత్యేకంగా మరో సెట్ నిర్మించారు. అందులో ఇప్పుడు కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ వారం నుంచి ఆ సన్నివేశాల షూటింగ్ ఉంటుందిట. ఇందులో చిరంజీవితో పాటు ప్రధాన తారాగణమంతా పాల్గొంటుందని సమాచారం.
ఈ సన్నివేశాలు రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలు సాహసో పేతంగానే ఉంటాయని అంటున్నారు. వాటికోసం చిరంజీవి కొంత ట్రైనింగ్ కూడా తీసుకున్నారుట. వయసు 60 మీద పడటంతో ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా వీలైనంత సౌకర్యవంతంగా పాల్గొనేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారుట. సినిమాకే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఈ ఫైట్ ఉంటుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సినిమాకి వీళ్లతో పాటు మరికొంత మంది ఫైట్ మాస్టర్లు కూడా పనిచేయడం విశేషం. ఇంతమంది ఫైటర్లతో పనిచేయడం చిరంజీవికిది రెండవసారి. గతంలో సైనా నరసింహారెడ్డి సినిమాకి వివిధ మాస్టర్లతో పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ పూర్తయితే షూటింగ్ కూడా క్లైమాక్స్ కి చేరుకున్నట్లే అంటున్నారు. ఎలా లేదన్నా జులై కల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది. ఆపై ఆగస్ట్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని ప్రణాళిక వేస్తున్నారుట.