రాజ్ తరుణ్ ఇష్యూలో భిన్నాభిప్రాయాలు

హీరో రాజ్ తరుణ్ పై ఆయన ప్రియురాలు లావణ్య పోలీసులకి చేసిన ఫిర్యాదు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-07-06 06:08 GMT

హీరో రాజ్ తరుణ్ పై ఆయన ప్రియురాలు లావణ్య పోలీసులకి చేసిన ఫిర్యాదు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజ్ తరుణ్ కెరియర్ పరంగా ఆశించిన స్పీడ్ లేదు. ఆరంభంలో లభించిన హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత రాజ్ తరుణ్ కి పెద్ద విజయాలు రాలేదు. ఈ ఏడాది నాగార్జున హిట్ మూవీ నా సామి రంగాలో కీలక పాత్రలో నటించాడు. అయితే ఈ క్యారెక్టర్ అతనికి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.

త్వరలో ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో చేసిన తిరగబడర సామి మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కింది. మూవీతో సక్సెస్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో అతని ప్రియురాలు రోడ్డెక్కింది. అనూహ్యంగా తిరగబడర సామి సినిమాలో హీరోయిన్ గా నటించిన మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని లావణ్య ఆరోపిస్తుంది. ఆమె పరిచయం అయ్యాక తనని దూరం పెట్టాడని అంటుంది.

మాల్వి మల్హోత్రా, ఆమె అన్నయ్య తనకి ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని లావణ్య ఆరోపణలు చేసింది. వారి మీద కూడా ఫిర్యాదు చేసింది. 11 ఏళ్ళు రిలేషన్ లో ఉండి మాల్వి మల్హోత్రా కలిసిన తర్వాత నుంచి నన్ను దూరం పెట్టాడని లావణ్య మెన్షన్ చేసి ఆరోపిస్తుంది. అయితే వీటిపై రాజ్ తరుణ్ వెర్షన్ మరోలా ఉంది. లావణ్య డ్రగ్స్ కేసులో దొరికిన తర్వాత ఆమె నుంచి నేను దూరంగా వచ్చానని చెబుతున్నాడు. మాల్వి మల్హోత్రాతో నేను రిలేషన్ షిప్ లో లేనని అంటున్నాడు.

కేవలం ప్రస్తుతం ఆమె ఉంటున్న నా ఇంటిని సొంతం చేసుకోవడానికి ఈ డ్రామాలు ఆడుగుతుందని ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ కి అలవాటు పడి నా దగ్గర చాలా సార్లు డబ్బులు డిమాండ్ చేసిందని, అయితే నా ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడం ఇష్టం లేక ఆమెని భరిస్తూ వచ్చానని రాజ్ తరుణ్ చెబుతున్నాడు. ఆమెని చట్టపరంగా ఫిర్యాదు చేసిన తర్వాత అన్ని వాస్తవాలు బయటపెడతానని రాజ్ తరుణ్ చెబుతున్నాడు.

అయితే లావణ్య చేస్తున్న ఆరోపణలకి రాజ్ తరుణ్ ఇస్తున్న క్లారిటీకి సింక్ కావడం లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. నిజంగా రిలేషన్ షిప్ లో లేకుండా కష్టపడి కొనుక్కున్న ఇంట్లో ఆమెని ఉండమని తాను బయటకి వచ్చేయడం ఏంటి అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంటే ఆమెపై ఇంత వరకు పోలీసులకి ఫిర్యాదు చేయకుండా ఉన్నాడు అని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు వాస్తవాలు దాస్తున్నారని అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News