బౌన్సర్లు ఓవరేక్షన్ తగ్గించాలి!
సెలబ్రిటీలంటే అభిమానులు మీదపడటం సహజం. సెల్పీల కోసం ఎగబడటం అంతే సహజం.
సెలబ్రిటీలంటే అభిమానులు మీదపడటం సహజం. సెల్పీల కోసం ఎగబడటం అంతే సహజం. ఆ విషయంలో హీరోలెప్పుడు సహనం కోల్పోయి ప్రవర్తించారు. వీలైతే దగ్గరకు పిలిచి ఓ సెల్పీ ఇస్తారు. లేదంటే ఓ చిరునవ్వుతో సరిపెడతారు. అదీ కుదరకపోతే కామ్ గా వెళ్లిపోతారు తప్ప మీద పడ్డారని సీరియస్ అవ్వడం వంటివి పెద్దగా చోటు చేసుకోవు. వీపరితమైన క్రౌడ్ ఉంటే? తప్ప వీలైనంత వరకూ వాళ్లకి ఓ ఫోటో ఇవ్వడానికే చూస్తుంటారు.
అయితే హీరోల పక్కన ఉండే బాడీగార్డుల ఓవరేక్షన్ కి అభిమానులు అభాసుపాలు అవ్వాల్సి వస్తోంది అన్నది వాస్తవం. నిన్నటి రోజున నాగార్జునతో ఓ ఫోటో దిగడం కోసం ఓ అభిమాని ఎయిర్ పోర్టులో ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ అభిమానిని నాగార్జున గమనించలేదు. ఆయన నడుచుకుంటూ వెళ్లిపోతుండగా అభిమానం చాటే ప్రయత్నం చేసాడు. అది నాగార్జున గమనించ లేదు.
కానీ బౌన్సర్ మాత్రం ఆ అభిమాని రెక్క పట్టుకుని నిర్ధాక్షణ్యంగా కిందకి విసిరేసే ప్రయత్నం మాత్రం ఎంతో హేయమైన చర్య. ఎయిర్ పోర్టులో జనాలు లేరు. నాగార్జున తో ఫోటోలు దిగాలని ఎగబడిన వారు అక్కడ లేరు. కానీ బాడీగార్డ్ ఓవరేక్షన్ మాత్రమే కనిపించింది. ఆ బాడీగార్డ్ నాగార్జునకు ఒక్క మాట చెప్పి ఫోటో తీయించే అవకాశం ఉన్నా? ఆ ఛాన్స్ తీసుకోలేదు.
అదే నాగార్జున గమనించి ఉంటే ఫోటో ఇచ్చేవారు. ఆ సన్నివేశం నెట్టింట వైరల్ అవ్వడంతో స్వయంగా క్షమాపణలు చెప్పారు నాగ్. దానికి కారణం బౌన్సర్. పక్కకు నెమ్మదిగా నెట్టొచ్చు. కానీ తొసేసి విసిరేయాల్సినంత అవసరం అక్కడ లేదు. భారీ ఎత్తున అభిమానులున్నప్పుడు అలాంటి పనులు ఎలాగూ చేస్తారు. ఆ మాత్రం దానికి ఎందకంత ఓవరేక్షన్ అంటూ సదరు బౌన్సర్ పై నెటి జనులు మండిపడుతున్నారు. బౌన్సర్లు ఇలాంటి చర్యలకు దిగడం కొత్తేం కాదు. గతంలో చాలా మంది హీరోల విషయంలోనూ ఇలా జరిగింది. వాళ్లను స్పాట్ లోనే కొంత మంది హీరోలు హెచ్చరించడం జరిగింది.