మదర్స్ డే: టాలీవుడ్ తార‌లు ఎమోష‌న‌ల్‌

సృష్టికి మూలం అమ్మ‌. అమ్మ లేనిదే సృష్టి లేదు! .. సామాన్యుడు అయినా సెల‌బ్రిటీ అయినా ఒక అమ్మ‌కు బిడ్డే.

Update: 2024-05-12 13:47 GMT

సృష్టికి మూలం అమ్మ‌. అమ్మ లేనిదే సృష్టి లేదు! .. సామాన్యుడు అయినా సెల‌బ్రిటీ అయినా ఒక అమ్మ‌కు బిడ్డే. ఆ మాట‌కొస్తే మాతృ దినోత్స‌వం రోజున మ‌న తెలుగు హీరోలు అమ్మ‌తో జ్ఞాప‌కాల‌ను పంచుకుంటూ ఎంత‌గా ఎమోష‌న‌ల్ అయ్యారో చూస్తుంటేనే అది అద్భుతం అనిపిస్తుంది. బాలీవుడ్, టాలీవుడ్ లో పాపుల‌ర్ స్టార్లు త‌మ మాతృమూర్తి తో మ‌ధుర‌స్మృతుల‌ను జ్ఞ‌ప్తికి తెచ్చుకున్నారు. అమ్మ‌తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను కూడా షేర్ చేసారు.


మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా మ‌ద‌ర్స్ తో సెల‌బ్రిటీల స్పెష‌ల్ ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి.. నాగ‌బాబు త‌మ త‌ల్లి గారైన అంజ‌నా దేవితో క‌లిసి ఉన్న ఫోటోలను ఇన్ స్టా మాధ్య‌మంలో షేర్ చేసారు. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తన కుమార్తె క్లిన్ కారా కొణిదెల మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా తనకు ఇచ్చిన మొదటి బహుమతిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బహుమతిలో తెల్లటి కాగితం ఉంది. దానిలో చిన్నారి కూతురు క్లిన్ కారా చేయి పాదాలు రంగులతో ముద్రించి ఉన్నాయి. ``హ్యాపీ మదర్స్ డే అమ్మా`` అని పేప‌ర్‌లో రాసి ఉంది. క్లిన్ కారా 20 జూన్ 2023న జన్మించింది. ఈ ఫోటోపై ఉపాసన స్పందిస్తూ, ``ఉదయమే నా మొదటి మదర్స్ డేని చాలా ప్రత్యేకంగా చేసినందుకు క్లిన్ కారాకు ధన్యవాదాలు`` అని తెలిపింది.


అలాగే ఇన్ స్టా మాధ్య‌మంలో అక్కినేని నాగ‌చైత‌న్య త‌న త‌ల్లి గారితో క‌లిసి ఉన్న ఫోటోను షేర్ చేయ‌గా అది అక్కినేని అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కూడా త‌న త‌ల్లి గారితో క‌లిసి ఉన్న ఒక ల‌వ్ లీ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసారు. కాజ‌ల్ అగ‌ర్వాల్, గౌత‌మ్ - సితార‌, శ్రీ‌విష్ణు, మెహ్రీన్ వంటి టాలీవుడ్ స్టార్లు త‌మ మాతృమూర్తితో క‌లిసి ఉన్న ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేసారు. త‌మ మాతృమూర్తికి శుభాకాంక్ష‌లు చెబుతూ మురిసిపోయారు.


బాలీవుడ్ స్టార్స్ రేర్ క్లిక్స్:

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ సోష‌ల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేసారు. అత‌డు బేషరతుగా ప్రేమించడం నేర్పినందుకు తన దివంగత తల్లి, ప్రముఖ నటి నర్గీస్ ద‌త్‌కు ధన్యవాదాలు తెలిపాడు. మీ ఆత్మ నా హృదయంలో నేను మోస్తున్న ప్రేమలో నివసిస్తుంది అమ్మా.. నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు సంజూభాయ్.


సీనియ‌ర్ క‌థానాయిక‌ కాజోల్ తన తల్లి, ఒకప్పటి నటి తనూజకు ఒక అందమైన ఫోటోతో మధురమైన నివాళిని అర్పించారు. కాజోల్ ఇలా రాసింది.. విచిత్రమైన తల్లులు మంచి పాత్రను నిర్మిస్తారు! కనీసం అదే నేను విన్నాను ... చింతించకండి అమ్మ.. నేను మన సంతోషకరమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తాను.. అని వ్యాఖ్య‌ను రాసిన కాజోల్ తన తల్లిని వెనుక నుండి కౌగిలించుకుని ఉన్న ఫోటోని షేర్ చేసారు.


బాలీవుడ్ డ్రీమ్ గ‌ర్ల్ హేమ మాలిని తన తల్లి జయ లక్ష్మితో కలిసి పోజులిచ్చిన కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసారు. న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ తన తల్లి సుతాపా సిక్దర్‌తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసారు. నటులు సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ .. వారి సోదరి సబా కూడా వారి తల్లి, ఒకప్పటి సూపర్ స్టార్ షర్మిలా ఠాగూర్‌కు ప్రేమపూర్వక నివాళి అర్పించారు.



Tags:    

Similar News