హాట్ బ్యూటీల నోట ఆ మాట..అదేంటంటే?

బీచ్ అంటే ఎవ‌రికి ఇష్ట ఉండ‌దు. సాగ‌ర తీరం అందాల‌ని ఆస్వాదించాల‌నే దేశాలు..ఖండాలు సైతం దాటెళ్లిపోతుంటారు సెల‌బ్రిటీలు.

Update: 2024-09-26 22:30 GMT

బీచ్ అంటే ఎవ‌రికి ఇష్ట ఉండ‌దు. సాగ‌ర తీరం అందాల‌ని ఆస్వాదించాల‌నే దేశాలు..ఖండాలు సైతం దాటెళ్లిపోతుంటారు సెల‌బ్రిటీలు. మాల్దీవుల‌తో వివాదం లేనంత కాలం ఎంచక్కా హీర‌యిన్లు అంతా ప్లైట్ ఎక్కి అక్క‌డ వాలిపోయారు. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు. మాల్దీవుల‌కు ధీటుగా ల‌క్ష్య దీవుల్ని రెడీ చేస్తున్నారు. అండ‌మాన్ దీవులు అంతే అందంగా ఉంటాయి. దేశంలో ఇత‌ర సాగ‌ర తీరాల‌ను మ‌రింత వృద్దిలోకి తీసుకొస్తున్నారు.

మ‌రి ఈ బీచ్ బ్యూటీ గురించి హాట్ భామ‌ల మ‌న‌సులో ఏమ‌నుకుంటు న్నారంటే?... నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా అల‌ల శ‌బ్దానికి క‌ష్టాల‌న్నీమ‌ర్చిపోతుందిట‌. మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉటుందంది. అలాగే శ్రీలీల `బీచ్ ని ద‌గ్గ‌ర నుంచి చూస్తే భావోద్వేగాలు అదుపులో ఉండ‌వు అంది. చిన్న పిల్లలా మారిపోతుందిట‌. నీలం రంగు నీళ్ల వైపు అలా చూస్తుంటే మ‌న‌సు తెలియ‌ని ఆనందానికి లోన‌వుతుంద‌ని జాన్వీ క‌పూర్ చెప్పుకొచ్చింది.

`తీరానాకి స‌ముద్రం రాసే ప్రేమ లేఖ‌లు అల‌లు` అంటూ హాట్ బ్యూటీ కేతిక శ‌ర్మ ముందుకొచ్చింది. ఇక అలియాభ‌ట్ బీచ్ లో స‌న్ సెట్ ని చూస్తుంటే ప్ర‌పంచాన్నే మ‌ర్చిపోతుందిట‌. `నీళ్ల‌ను చూస్తే చాలు మ‌న‌సు ప్ర‌శాంతంగా అనిపిస్తుంది. పాడిల్ బోర్డింగ్ అయితే ప‌క్కా ఉండాలి అంటోంది సంయుక్తా మీన‌న్. ఇక సారా అలీఖాన్ బీచ్ ఇష్ట‌మా? కొండ‌లు చూడ‌టం అంటే ఇష్ట‌మా? అంటే బీచ్ లో సన్ సెట్ ని ఇష్ట‌ప‌డుత‌న్న‌ట్లు తెలిపింది.

ఇక ప్ర‌గ్యా జైశ్వాల్ మ‌న‌సునైతే స‌ముద్రం దోచేస్తుందిట‌. అలాగే మాలీవుడ్ బ్యూటీ అనుప‌మ బీచ్ లో బ‌ర్త్ డే చేసుకుంటే ఆ కిక్కే వేర‌ప్పా అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ డైలాగ్ కొట్టింది. సూర్యోద‌యం నుంచి సూర్యాప్త మ‌యం వ‌ర‌కూ బీచ్ లో గ‌డ‌పడం ఎంతో ఇష్టం అంటోంది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఇక బీచ్ అందాల్లో ఈ బ్యూటీలంతా ఎలా చెల‌రేగుతారు? అన్న‌ది చెప్పాల్సిన పనిలేదు. టూపీస్...బికినీ...స్విమ్ షూట్ లో దూరిపోతారు. హాట్ ఫోటోల‌తో వైవిథ్య‌మైన భంగిమ‌ల‌తో ఆక‌ట్టుకోవ‌డం ప‌రిపాటే.

Tags:    

Similar News