బెడ్ పై జాన్వీ అలా.. అదిరిపోయేలా..

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

Update: 2024-09-04 20:30 GMT

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తోంది అమ్మడు. పక్కా పల్లెటూరి అమ్మాయి తంగం పాత్రలో సందడి చేయనుంది. ఇప్పటి మూవీ నుంచి రిలీజ్ అయిన ఆమె పోస్టర్స్, చిందేసిన సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. తారక్, జాన్వీ జోడీకి అప్పుడే మంచి మార్కులు పడిపోయాయి. చుట్టమల్లే సాంగ్ అయితే యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది.

భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. దీంతో జాన్వీ అందచందాలను తెగ పొగడేస్తున్నారు సినీ ప్రియులు. ఇంకా దేవర మూవీ సెట్స్ పై ఉండగానే.. మరో స్టార్ హీరో రామ్ చరణ్ మూవీలో జాన్వీ ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు, చరణ్ కాంబోలో రానున్న మూవీలో హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు జరగ్గా.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. ఫస్ట్ షెడ్యూల్ లో జాన్వీ కూడా పాల్గోనుందని టాక్ నడుస్తోంది.

దివంగత నటి శ్రీదేవి కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. విభిన్న పాత్రలు పోషిస్తూ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. డెబ్యూ ధడక్‌ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న బ్యూటీ.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటోంది. ఆమె నటించిన ఎక్కువ సినిమాలు ఓటీటీల్లోనే రిలీజ్ అయ్యాయి. టాలెంట్ తో పాటు అందచందాలతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్.

అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది అమ్మడు. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటోంది. అటు చీరల్లో.. ఇటు మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తుంటోంది. తన లుక్స్ తో కుర్రకార్రును కవ్విస్తుంటోంది. నెట్టింట హీటు పుట్టించడంలో తనే రూటే సపరేట్ అన్నట్లు మెప్పిస్తుంటోంది. గ్లామర్ డోస్ పెంచేసి తగ్గేదేలే అన్నట్లు అలరిస్తుంటోంది. రీసెంట్ గా జాన్వీకి చెందిన ఓ పిక్.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

అందులో జాన్వీ ఓ రేంజ్ లో ఉంది. బ్లాక్ కలర్ షైనింగ్ డ్రెస్ వేసుకున్న అమ్మడు.. బెడ్ పై అదిరిపోయే పోజు ఇచ్చింది. హెయిర్ లీవ్ చేసి తన లుక్స్ తో ఫ్లాట్ చేసేసింది. తన వయ్యారంతో మైండ్ బ్లాక్ చేసేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారగా.. నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. పిక్ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. జాన్వీ.. అందానికి పర్యాయపదమంటూ కొనియాడుతున్నారు. గ్లామరస్ క్వీన్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.

Tags:    

Similar News