'బెస్ట్ స్మెల్లింగ్' నటి అని కితాబిచ్చిన సూపర్‌స్టార్
మేటి కథానాయిక రవీనా టాండన్ తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లలో నటించిన గ్లామరస్ నాయికగా రవీనాకు మంచి పేరుంది
మేటి కథానాయిక రవీనా టాండన్ తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లలో నటించిన గ్లామరస్ నాయికగా రవీనాకు మంచి పేరుంది. మోహ్రా, అందాజ్ అప్నా అప్నా, దమన్, పత్తర్ కే ఫూల్, KGF 2 సహా పలు చిత్రాలతో దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ ప్రేమికుల హృదయాలను ఏలింది ఈ బ్యూటీ.
తన కెరీర్‌లో అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, గోవిందా, నందమూరి బాలకృష్ణ సహా పలువురు స్టార్లతో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకుంది. ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో SRK తనను `అత్యుత్తమ వాసనగల నటి` అని ప్రశంసించారని గుర్తుచేసుకుంది.
`జమానా దీవానా` (1995) మూవీ చిత్రీకరణ సమయంలో ఆ ప్రశంస దక్కింది. ఇప్పుడు కూడా నేను అతడిని కలిసినప్పుడల్లా నాతో ఎప్పుడూ ఈ తమాషా మాట చెప్పేవాడు. ``నేను చాలా మంది హీరోయిన్‌లతో పనిచేశాను.. కానీ నువ్వే ఎప్పుడూ బెస్ట్ స్మెల్లింగ్‌గా ఉంటావు`` అనే ప్రశంస అతడి నుంచి దక్కినట్టు రవీనా బాలీవుడ్ హంగామాతో చాటింగ్ సెషన్ లో చెప్పింది.
వృత్తిపరంగా... రవీనా చివరిసారిగా `పాట్నా శుక్లా` అనే చిత్రంలో కనిపించింది. అర్బాజ్ ఖాన్ నిర్మించిన ఈ లీగల్ డ్రామాలో మానవ్ విజ్, చందన్ రాయ్ సన్యాల్, సతీష్ కౌశిక్, అనుష్క కౌశిక్, జతిన్ గోస్వామి తదితరులు ప్రముఖ పాత్రల్లో నటించారు. దీనికి వివేక్ బుడకోటి దర్శకత్వం వహించారు. రవీనా ఇటీవల వెబ్ సిరీస్ లలోను నటించేందుకు సంతకాలు చేసారు. సంచలనాల కేజీఎఫ్ 2లో జాలి దయ లేని ప్రధాని రమికాసేన్ పాత్రలో నటించింది. ఈ ఫ్రాంఛైజీ కొనసాగితే రవీనా పాత్రకు కొనసాగింపు ఎలా ఉంటుందో వేచి చూడాలి.