వ‌య‌సును 60 నుంచి 20కి త‌గ్గించిన న‌టి!

జాతీయ ఉత్త‌మ న‌టి ట‌బు తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫోటోషూట్ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారుతోంది.

Update: 2024-12-04 05:26 GMT

దాదాపు మూడు దశాబ్దాలుగా నట‌రంగంలో కొన‌సాగుతున్నారు సీనియ‌ర్ న‌టి టబు. కెరీర్ లో అత్యంత సంక్లిష్టమైన పాత్రలలో అద్భుతంగా న‌టించి మెప్పించిన చరిత్ర త‌న‌కు ఉంది. ఎన్నో చిత్రాల్లో స్థిర‌మైన డెప్త్ ఉన్న న‌ట‌న‌తో ప్ర‌జ‌ల్ని మెప్పించారు. అత్యంత‌ సంక్లిష్టమైన కళలో టబు ప్రావీణ్యం ఒక మైమ‌ర‌పు. అస్తిత్వ నుండి హైదర్, ది నేమ్‌సేక్ నుండి 'అంధాధున్' వరకు లేయర్డ్ లేడీ పాత్ర‌లో అనేక షేడ్స్ ని ప్ర‌ద‌ర్శించిన తీరు మ‌హ‌దాద్భుతం. చాందిని బార్ లో న‌ట‌న‌కుగాను ఉత్త‌మ‌న‌టిగా జాతీయ అవార్డును అందుకున్నారు ట‌బు. తెలుగులో నిన్నేపెళ్లాడుతా, త‌మిళంలో కాద‌ల్ దేశం (ప్రేమ‌దేశం -తెలుగు) స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో ట‌బు న‌టించారు. ఇటీవ‌ల విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రం క్రూలో టీజింగ్ గాళ్ పాత్ర‌లో ట‌బు న‌ట‌న‌కు మైమ‌రిచిపోయింది యువ‌త‌రం.

 

90వ దశకంలో మాస్ క్లాస్ పాత్ర‌ల‌తో అల‌రించారు ఈ సీనియ‌ర్ బ్యూటీ. ప్రస్తుత కాలంలోను ప్రేక్షకులు, వారి ప్రాధాన్యతలు మారినప్పటికీ, హద్దులు దాటి ప్ర‌తిభ‌ను చాటడంలో టబు సామర్థ్యం స్థిరంగా ఉంది. అసాధారణమైన పాత్రలతో తనదైన ముద్ర వేయడానికి వెన‌కాడ‌న‌ని ఇప్ప‌టికీ నిరూపిస్తోంది. భారతీయ చిత్రాలలోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా ప్రయోగాత్మక సినిమాల్లో న‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

డెనిస్ విల్లెనెయువ్ బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ఫ్రాంచైజీ ప్రీక్వెల్ స్పిన్-ఆఫ్ షో అయిన 'డూన్: ప్రొఫెసీ'లో ట‌బు గ్రాండ్ అరంగేట్రం కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. డూన్: ప్రొఫెసీలో ట‌బు పోషించిన పాత్ర సిస్టర్ ఫ్రాన్సిస్కా. ఇది న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పూర్తి వైవిధ్య‌మైన పాత్ర‌. టబు నటించిన #డూన్ ప్రొఫెసీ ఎపిసోడ్ డిసెంబర్ 15న @streamonmaxలో .. డిసెంబర్ 16న భారతదేశంలో @officialjiocinemaలో ప్రదర్శితం కానుంది. 'డూన్ ప్రొఫెసీ' నవంబర్ 18న భారతదేశంలో ప్రీమియర్ కానుండ‌గా, ఏడు ఎపిసోడ్‌లతో అల‌రించ‌నుంది. ఫైనల్ గా ఇది డిసెంబర్ 30న స్ట్రీమ్ అవుతుంది.

జాతీయ ఉత్త‌మ న‌టి ట‌బు తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫోటోషూట్ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్ర‌స్తుతం 53 వ‌య‌సులో ఉన్న ట‌బు 20 కి షిఫ్ట్ అయిందంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏజ్ పైబ‌డుతున్నా కానీ, ట‌బు ఇప్ప‌టికీ గ్లామ‌ర్ క్వీన్ గానే మెరిసిపోతోంది. ముఖ్యంగా ఇటీవ‌ల విడుద‌లైన క్రూ సినిమాలో సాటి సీనియ‌ర్ న‌టి క‌రీనా, నేటిత‌రం బ్యూటీ కృతి స‌నోన్ తో పోటీప‌డి అందాలు ఆర‌బోసింది. ఏజ్ లెస్ బ్యూటీగా త‌న అభిమానుల‌ను అల‌రిస్తోంది.

Tags:    

Similar News