ఫోటో స్టోరి: హీరోయిన్ భంగిమకు ప్రియుడు ఔట్!
గత కొంతకాలంగా శివసేన అధినేత దివంగత బాల్ థాకరే మనవడు ఐశ్వరితో అలయకు లింక్ ఉందంటూ ప్రచారం సాగుతోం
ఆలయ ఎఫ్ పరిచయం అవసరం లేదు. ఈ యంగ్ బ్యూటీ వెటరన్ కథానాయిక పూజా భేడీ కుమార్తె. ఇప్పటికే నాలుగైదు చిత్రాల్లో నటించేసిన ఆలయ నటిగా తనను తాను నిరూపించుకుంది. టాప్ మోడల్ గాను సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గాను కొనసాగుతోంది. ఆలయ తాజాగా షేర్ చేసిన కొత్త ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు తన ప్రియుడు (ప్రచారం ఉంది) ఐశ్వరీ థాకరే నుండి స్పందన వచ్చింది. అలయ ఎఫ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌పై ఐశ్వరీ థాకరే వ్యాఖ్యానించారు. ''మీరు నా నుండి అలా దూరంగా వెళ్లడం నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే మీరు నన్ను ఇర్రిటేట్ చేసినా తియ్యని రీతిలో చికాకుపెడతారు.. ఇది బాధించే విధంగా కాదు'' అని వ్యాఖ్యను జోడించాడు.
ఆలయ ఎఫ్ షేర్షా లోని ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ ఉన్న వీడియోను షేర్ చేసింది. ఇది పూర్తిగా కొత్తది .. నా కంఫర్ట్ జోన్లో లేనిది ప్రయత్నించాను! అని తెలిపింది. అయితే అంతగా సౌకర్యం లేని ఈ డ్యాన్సుతో ఆలయ కొంత చికాకును ఎదుర్కొంది. రకరకాల భంగిమల్లో డ్యాన్సులు చేసేప్పుడు అవి కెమెరాలో క్యాప్చుర్ కావడంతో కొన్ని భంగిమలు ప్రియుడిని ఇర్రిటేట్ చేసాయి. కానీ అవి ఎంతో స్వీట్ గా ఉన్నాయంటూ బాధించలేదంటూ అతడు పొగిడేశాడు.
గత కొంతకాలంగా శివసేన అధినేత దివంగత బాల్ థాకరే మనవడు ఐశ్వరితో అలయకు లింక్ ఉందంటూ ప్రచారం సాగుతోంది. గతేడాది దుబాయ్‌లో జరిగిన అతని పుట్టినరోజు వేడుకకు ఆలయ హాజరైన తర్వాత పుకార్లు మొదలయ్యాయి. ఆలయ 22వ పుట్టినరోజును కూడా వారు కలిసి జరుపుకున్నారు. అలయ ఐశ్వరిని మంచి స్నేహితుడు అని చెబుతోంది. అతనితో లవ్ లో లేనే లేనని ఖండించింది. ఇంతకుముందు ఇంటర్వ్యూలలో ఆమె మాట్లాడుతూ.. చాలా కాలంగా ఒకరికొకరం తెలుసు. కుటుంబాల మధ్య సత్సంబంధాలున్నాయి. కలిసి నటన డ్యాన్స్ కి సంబంధించిన తరగతులకు వెళుతుంటామని తెలిపింది.
ఆలయ గత సంవత్సరం జవానీ జానేమన్ చిత్రంతో తన కెరీర్ ని ప్రారంభించింది. తన తండ్రిని వెతుక్కుంటూ లండన్‌కు వచ్చే యువతిగా ఈ చిత్రంలో అద్భుతంగా నటించింది. ఈ చిత్రంలో ఆమె సైఫ్ అలీ ఖాన్, టబు, కుబ్రా సైత్, చుంకీ పాండేతో కలిసి నటించింది. ఆమె నటనకు ఉత్తమ డెబ్యూ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. ఆ తర్వాత అలయ ఆజ్ సజేయ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. వరుసగా రెండు చిత్రాల్లో నటిస్తున్నానని ప్రకటించింది. ఏక్తా కపూర్ నిర్మించిన కన్నడ హిట్ యు టర్న్ హిందీ రీమేక్‌లో ఆమె జర్నలిస్ట్ పాత్రను పోషించింది. ఆమె శశాంక ఘోష్ దర్శకత్వం వహించిన ఫ్రెడ్డీ అనే డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ లోను నటించింది. కార్తీక్ ఆర్యన్ సరసన ఫ్రెడ్డీలో నటించింది.