నెగటివ్ ట్రోల్స్.. అమీ జాక్సన్ గట్టిగానే ఇచ్చింది
నటి అమీ జాక్సన్ కొత్త లుక్‌పై రీసెంట్గా సోషల్ మీడియాలో భారీగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే
నటి అమీ జాక్సన్ కొత్త లుక్‌పై రీసెంట్గా సోషల్ మీడియాలో భారీగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. నెటిజన్లు ఆమె తీవ్రంగా నెగటివ్‌గా ట్రోల్ చేశారు. ఐరిష్ స్టార్ యాక్టర్ సిలియన్ మర్ఫీని పోలినట్టు ఆమె కొత్త లుక్ ఉందంటూ పలువురు కామెంట్లు చేశారు. అయితే తాజాగా ఈ ట్రోల్స్‌పై అమీ జాక్సన్ రియాక్ట్ అయ్యారు. భారతీయుల నుంచి ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడం చాలా బాధకరమైన విషయం అని చెప్పారు.
సోషల్ మీడియాలో ఇండియన్స్ నుంచి(ముఖ్యంగా మగవాళ్లు) ఇటువంటి ట్రోల్స్ జరగడం నిజంగా బాధకరమైన విషయం. ఒక స్త్రీ తన అందానికి వ్యతిరేకంగా ఉన్న విధంగా తయారైతే, ట్రోల్ చేసే హక్కు తమకు ఉందని వారు భావిస్తుంటారు. అయితే నేను సినిమాకు తగ్గట్టు లుక్ విషయంలో తరచూ మార్పులు చేసుకునే ప్రముఖ నటులతో కలిసి పని చేశాను.
ఏదైనా ఒక సినిమా కోసం లుక్స్ పరంగా మార్పులు చూపిస్తుంటే ఎవరైనా ప్రశంసిస్తారు. కానీ, నన్ను మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం నేను యూకేలో ఓ మూవీ చేస్తున్నాను. ఆ మూవీ కోసమే నా లుక్స్‌ను ఛేంజ్ చేసుకున్నాను. నేను నా పనిని చిత్త శుద్ధితో చేస్తాను. అందుకే నేను మరింత స్లిమ్‌గా పాత్రకు తగ్గటు మారాను అని చెప్పింది.
ఇక ఐరిష్ యాక్టర్ సిలియన్ మర్ఫీతో తన లుక్‌ను కంపేర్ చేయడం కూడా మాట్లాడింది అమీ జాక్సన్. దానికి నేనేమీ బాధపడటం లేదు. అలాంటి ఓ గొప్ప యాక్టర్‌తో నన్ను పోల్చినందుకు సంతోషిస్తున్నాను అని ఆమీ పేర్కొంది. కాగా, అమీ జాక్సన్ సౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీలోను పలు సినిమాల్లో యాక్ట్ చేసి ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. 2018లో రిలీజైన '2.0' తర్వాత ఆమె కొంత కాలం చిత్రాలకు దూరంగా ఉన్నారు.
రీసెంట్గా ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఆ ఫొటోలనే ఆమె సోషల్ మీడియాలో నెటిజన్లు, ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. అప్పుడు ఆమె లుక్ చూసిన నెటిజన్లు షాక్ అండ్ సర్ప్రైజ్ అయాయరు. 'అమీ జాక్సన్‌కు ఏమైంది? ఎందుకు ఇలా అయిపోయింది?, సిలియన్ మర్ఫీలా ఉంది ' అంటూ రకరకాలు కామెంట్స్ చేస్తూ నెగటివ్‌గా ట్రోల్ చేశారు. .