ఫోటో స్టోరి: మోనాలిసాకు అయినా మ‌తి చెడేలా

అవును.. మోనాలిసా అంత‌టి అంద‌గ‌త్తెకు అయినా మ‌తి చెడ‌టం ఖాయం. అంతందంగా క‌నిపిస్తోంది ఈ ఫోటోగ్రాఫ్.

Update: 2024-08-13 17:30 GMT

అవును.. మోనాలిసా అంత‌టి అంద‌గ‌త్తెకు అయినా మ‌తి చెడ‌టం ఖాయం. అంతందంగా క‌నిపిస్తోంది ఈ ఫోటోగ్రాఫ్. ఇందులో ఉన్న ముద్దుగుమ్మ మ‌రెవ‌రో కాదు.. ది గ్రేట్ దిశా ప‌టానీ. సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా షేర్ అవుతున్న దిశా లేటెస్ట్ ఫోటోషూట్ ఇత‌ర ఫోటోషూట్ల కంటే సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్షిస్తోంది. ఒక బికినీపై ఉల్లి పొర‌లాంటి డ్రెస్ ధ‌రించిన దిశా ప‌టానీ స‌మ్మోహ‌న రూపానికి ఫిదా కాని వారు లేనే లేరు. ప్ర‌స్తుతం ఈ అంద‌మైన ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో అగ్గి రాజేస్తోంది.

దిశా వాస్త‌వానికి మోనాలిసాను త‌ల‌పిస్తోంది! అంటూ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌ఖ్యాత చిత్ర‌కారుడు లియోనార్డో డావిన్సీ మోనాలిసా చిత్త‌రువును పెయింటింగ్ చేసారు. ఈ పెయింటింగ్ ఒక అంద‌మైన ఆడ‌బొమ్మ‌. అదే అందం.. మోము.. ముక్కు తీరు.. అవే క‌ళ్లు! అంటూ ఇప్పుడు దిశా ప‌టానీ ఫోటోగ్రాఫ్ ని వీక్షించిన అభిమానులు క‌విత‌లు అల్లుతున్నారు.

మోనాలిసా క‌థ ఇదీ:

మోనాలిసా ఒక మహిళ ఫోటో. ఒక సంపన్న ఫ్లోరెంటైన్ వ్యాపారి ఫ్రాన్సిస్కో డెల్ గియోకోండో భార్య అని చ‌రిత్ర‌కారులు నమ్ముతారు. ఈ పెయింటింగ్ ను ప్రత్యామ్నాయంగా జియోకొండ అని కూడా పిలుస్తారు. ఆమె పేరు లిసా గెరార్డిని. 1479లో జన్మించింది. పాత కులీన ఇటాలియన్ కుటుంబానికి చెందిన యువ‌తి. ఆమె 1495లో ఫ్రాన్సిస్కో డెల్ జియోకోండోను వివాహం చేసుకుంది. ఈ దంప‌తుల‌కు ఆరుగురు పిల్లలు ఉన్నారు. 1516లో ఫ్రాన్సిస్కో తన భార్య చిత్రపటాన్ని పెయింటింగ్ చేయాల్సిందిగా లియోనార్డో డా విన్సీని నియమించుకున్నాడు. చిత్ర‌కారుడు డావిన్సీ ఫ్లోరెన్స్‌లో పనిని ప్రారంభించాడు. కింగ్ ఫ్రాన్సిస్ I ఆహ్వానం తర్వాత అతడు ఫ్రాన్స్‌లో పెయింటింగ్ (డ్రాయింగ్‌)ను కొనసాగించాడు. డావిన్సీ 1517లో మరణించాడు.

అతడి మ‌ర‌ణం త‌ర్వాత ఈ పెయింటింగ్ ఒక ఫ‌జిల్ గా మారింది. పెయింటింగ్‌పై అత‌డి సంతకం లేదు.. తేదీ కూడా లేదు. డా విన్సీ పేపర్‌లలో కమీషన్ ప‌రిశీల‌న‌లో ఎటువంటి రికార్డు లేదు. మోనాలిసా అనే పేరు డావిన్సీ మరణించిన 31 సంవత్సరాల తర్వాత 16వ శతాబ్దం మధ్యలో జార్జియో వసారి రాసిన డావిన్సీ జీవిత చరిత్ర పుస్త‌కంలో క‌నుగొన్నారు. డావిన్సీ కొన్నిసార్లు త‌న పెయింటింగ్స్ లో వాస్తవాన్ని కల్పనతో మిళితం చేసేవాడు. కాబట్టి మోనాలిసా గుర్తింపు ఇప్పటికీ సందేహాస్పద‌మైన‌దిగా చర్చల్లో ఉంది.

Tags:    

Similar News