దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ కెరీర్ జర్నీ వ్యక్తిగత జీవితం గురించి తెలిసిందే. నటిగా బహుముఖ ప్రజ్ఞతో పేరు తెచ్చుకుంది. ఈ బ్యూటీ బలమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు వైవిధ్యమైన పాత్రల ఎంపికతో ప్రత్యేకతను ఆపాదించుకుంది. నటనకు అంకితమయ్యే స్వభావం అభిమానులను సంపాదించిపెట్టింది. ఫాతిమా ఇతర నాయికల్లానే నిరంతరం ఫోటోషూట్లను ఇన్ స్టా మాధ్యమంగా షేర్ చేస్తూ అందరికీ టచ్ లో ఉంది.
ఇన్ స్టాలో ఈ భామకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. తాజాగా ఫాతిమా ఒక కొత్త లుక్ ని షేర్ చేసి దానికి అందమైన క్యాప్షన్ ఇచ్చింది. నా హేటర్స్ చెబుతారు.. ఇందులో ఆ మూడో ఫోటో నేను కాదు అని!! అంటూ ఒక స్పెషల్ ఫోటోగ్రాఫ్ ని సనా షేక్ షేర్ చేసింది. ఆ మూడో ఫోటో ఒక లవ్ లీ డాగ్. అది ప్రత్యేకమైన డిజైనర్ బ్రీడ్ అని ఫోటోని బట్టి అర్థమవుతోంది. సనాలోని సర్కాజమ్, ఫన్ ఎలిమెంట్ ని దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. అయితే ఫాతిమాను ఒక కొంటె అభిమాని ఇలా ఏడిపించాడు. కచ్ఛితంగా ఆ మూడో ఫోటోలో ఉన్నది నువ్వే.. మిగతా ఫోటోలు నీవి కావు! అంటూ ఆటపట్టించాడు.
మామిడి పళ్లు ఇష్టం:
ప్రస్తుతం వేసవి కాలంలో ప్రజలు ఏ రూపంలోనైనా మామిడి పండ్లను ఆస్వాధించడానికి ఇష్టపడతారు. ఇటీవల, ఫాతిమా సనా షేక్ ఈ వేసవి సీజన్లో పండ్లలో రాజు అయిన మామిడి పండుపై తన ప్రేమను వ్యక్తం చేసింది. తాజా ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన పండ్ల గురించి మాట్లాడుతూ, ``నేను వాటిలో మూడు ఒకేసారి తినగలను. ఇది ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన పండు అని నా అభిప్రాయం. చాలా విభిన్న వేరియంట్లు ఉన్నాయి. నాకు అల్ఫోన్సో (హాపుస్), తోతాపురి, పైరి అంటే చాలా ఇష్టం. మనలో ప్రతి ఒక్కరికి ఈ పండుపై విపరీతమైన మక్కువ. ఇంట్లో ఆఖరి మామిడి పండు కోసం పోరాడడం అనే జ్ఞాపకం ప్రతి ఒక్కరికీ ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా సోదరుడికి నాకు మధ్య తరచుగా ఇలా జరిగేది (నవ్వుతూ). ఈరోజు మామిడి పండ్లను అట్ట పెట్టెల్లో దొరుకుతున్నాయి. కానీ ఇంతకు ముందు వాటిని ఎండుగడ్డితో చెక్క పేటీలో ఇంటికి తెచ్చేవారు. సరైన మామిడిని కనుగొనడానికి ఎండుగడ్డిని జల్లెడ పట్టడానికి నేను సంతోషిస్తాను`` అని ఫాతిమా అంది. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి పచ్చి మామిడి కాయలు కోసుకుని తిన్నానని జ్ఞాపకాలను ఫాతిమా షేర్ చేసారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఫాతిమా సనా షేక్ తదుపరి ఉల్ జలూల్ ఇష్క్ - మెట్రో ఇన్ డినోలో కనిపించనుంది.