ఆ హీరోయిన్ రచయిత్రిగానూ మారిందే!
బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్` తో పరిచయ మైన భామ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. అటుపై ఎన్నో హిట్ చిత్రాలతో పాటు..భిన్నమైన పాత్రల్లోనూ నటించి మరింత ఫేమస్ అయింది. హ్యూమా అంటే బాలీవుడ్ లో ఓ బ్రాండ్ ఐడెంటిటీని వేసింది. మ్యూజిక్ వీడియోస్..టెలివిజన్ పైనా అమ్మడు తనదైన ముద్ర వేసింది. తాజాగా అమ్మడు నటిగానే కాదు మంచి రచయితగానూ గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంది.
`జెబా: యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో` అనే నవలతో రచయిత్రిగానూ పరిచయం అవుతుంది. తనలో మంచి రచయిత్రి దాగి ఉంది అన్న విషయాన్ని ఈ నవల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పబోతుంది. ఢిల్లీ నుంచి చిత్ర పరిశ్రమకి వచ్చి భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ఆమె తన సినీ ప్రయాణం నంచి ప్రేరణ పొంది ఈ నవల రాసారుట. ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఇలా వ్యాఖ్యానించింది.
` నా తొలి నవలని ప్రకటిస్తున్నందకు చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్ నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. నా జీర్నీలో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇదొక గొప్ప ప్రయాణం. కొత్తదనం కోరుకునే ప్రపంచంలో మనమంతా జీవిస్తున్నాం. ప్రతీ ఒక్కరి జీవితం అందమైన ...అద్భుత మైన కథగా ఉంటుంది. మహిళల జీవితం కేవలం ఒక కథ మాత్రమే కాదు. తరతరాలకు స్పూర్తినిస్తాయి. మనం కూడా మన జీవితంలో హీరోలమని.. మంచి స్థాయిలో ఉండగలమని గుర్తు చేసుకోవడానికి అలాంటి కథలు అవసరం.
నేను రాసిన ఆ నవల పూర్తిగా నా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. నా జీవితంలో అనుభూతుల్ని అందులో పొందు పరిచా` అని అన్నారు. మరి ఆ అనుభూతులు ఎలాంటివన్నవి తెలియాలంటే పుస్తక ప్రియులు డిసెంబర్ వరకూ వెయిట్ చేయాల్సిందే. హ్యూమా ఖురేష్ ఈ నవలని 37 ఏళ్ల వయసులోనే రచించింది. దీంతో ఆమెకు చదవడం అంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ప్రస్తుతం హ్యూమా ఖురేషీ `పూజా మేరీ జాన్` అనే చిత్రంలో నటిస్తోంది.