ఒట్టేసి చెబుతున్నా... బాబోయ్ ఇంత మారిందేంటి!
శ్రీకాంత్ ఫ్యామిలీ హీరోగా పీక్స్ లో ఉన్న సమయంలో వచ్చిన చిత్రం ఒట్టేసి చెబుతున్నా.
శ్రీకాంత్ ఫ్యామిలీ హీరోగా పీక్స్ లో ఉన్న సమయంలో వచ్చిన చిత్రం ఒట్టేసి చెబుతున్నా. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2003 సంవత్సరంలో విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుని, ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన ఆ సినిమాలో శివాజీ కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో శ్రీకాంత్ కు జోడీగా నటించిన హీరోయిన్ కనిహా. తక్కువ సమయంలోనే ఈమె తెలుగు తో పాటు తమిళ్ లో చాలా ఎక్కువ సినిమాలు చేసింది.
ఒట్టేసి చెబుతున్నా సినిమాలో పక్కింటి అమ్మాయి మాదిరిగా, చాలా నేచురల్ గా కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. నటిగా ఎన్నో సినిమాల్లో కనిపించిన కనిహా వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే ఇండస్ట్రీని వదిలి వెళ్లి పోయింది. అమెరికా కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను వివాహం చేసుకుని అక్కడ సెటిల్ అయ్యింది. ఆమె అన్ని భాషల్లో కలిపి దాదాపు 25 సినిమాలు చేసింది. అందులో సక్సెస్ సినిమాలు ఎక్కువ. ఆమె ప్రయత్నిస్తే, ఇండస్ట్రీలో కొనసాగితే మరో 25 సినిమాలు కూడా ఈజీగా చేసేది, కానీ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయ్యింది.
సినిమాల్లో నటించడం తగ్గించినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈమె జోరు కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కనిహా కి ఒక బాబు ఉన్నాడు. ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్న కనిహా మళ్లీ సపోర్టింగ్ రోల్స్ తో ఇండస్ట్రీ లో రీ ఎంట్రీ ఇచ్చింది. మరో వైపు సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా, తన రెగ్యులర్ రొటీన్ వీడియోలను షేర్ చేయడం ద్వారా మిలియన్ మంది ఫాలోవర్స్ ను దక్కించుకుంది. సోషల్ మీడియాలో ఈమె సందడి కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో సినిమాల్లో కూడా బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2008 లో పెళ్లి చేసుకున్న కనిహా అందం విషయంలో ఏమాత్రం తగ్గలేదు. గతంలో కంటే కాస్త బరువు పెరిగింది... అంతే తప్ప అందం ఏమాత్రం తగ్గలేదు. అంతే కాకుండా ఈమెకు నటనపై ఉన్న ఆసక్తితో రెగ్యులర్ గా ఫోటో షూట్స్ ఇస్తూ వచ్చింది. కనుక భవిష్యత్తులో కనిహా నటిగా బిజీ అవ్వడం ఖాయం అని, సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఆశ్చర్యం లేదు అంటూ ఈమె అందమైన ఫోటోలను చూసి నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.