నా రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టారు
కృతి కర్బంద మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కన్నడ సినిమా షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్లాను
బోణి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. మొదటి సినిమాతో నిరాశ పరిచిన కూడా తన అందాల ఆరబోత నేపథ్యంలో పలు సినిమాల్లో నటించే ఛాన్స్ ను దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమాలో నటించడం ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో సక్సెస్ లు దక్కలేదు.
తెలుగు సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రాకున్నా కూడా కన్నడ, హిందీ సినిమాలు చేస్తూ కెరీర్ లో కొనసాగుతూ వస్తున్న ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హీరోయిన్స్ షూటింగ్స్ కు ఔట్ డోర్ వెళ్లిన సమయంలో.. ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని కృతి తన మాటల ద్వారా చెప్పకనే చెప్పింది.
కృతి కర్బంద మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కన్నడ సినిమా షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్లాను. అక్కడ ఒక హోటల్ లో బస చేయాల్సి వచ్చింది. నేను ప్రైవేట్ ప్లేస్ ల్లో బస చేసే సమయంలో తప్పకుండా చుట్టు పక్కల క్షుణంగా చూస్తాను. నేను నా టీం మెంబర్స్ ఆ రూమ్ లో చూస్తూ ఉన్న సమయంలో ఒక సీక్రెట్ కెమెరా కనిపించింది.
టీవీ సెటప్ బాక్స్ వెనక సీక్రెట్ కెమెరాను పెట్టి ఉంచారు. ఆ కెమెరా ను చూసి షాక్ అయ్యాను. ఇలాంటి దారుణమైన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయని అప్పుడే అనిపించింది. నా రూమ్ లో సీసీ కెమెరా బయట పడ్డప్పటి నుండి కూడా మరింత జాగ్రత్తగా ఉంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కృతి సూచించింది.