ఆ రోజు వచ్చింది.. సంతోషంలో లావణ్య త్రిపాఠి
అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు నటించిన సినిమాల్లో కొన్ని నిరాశ పరచడం, దాంతో ఆఫర్స్ తగ్గడం జరిగింది
అందాల రాక్షసి సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ప్రేక్షకులతో నిజంగానే అందాల రాక్షసి ఈ అమ్మడు అనిపించుకుంది. తన అందంతో పాటు నటనతో మెప్పించి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు నటించిన సినిమాల్లో కొన్ని నిరాశ పరచడం, దాంతో ఆఫర్స్ తగ్గడం జరిగింది. అయినా కూడా నిరుత్సాహ పడకుండా సినిమాల్లో ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమ వివాహం తర్వాత కూడా లావణ్య త్రిపాఠి కెరీర్ ను కొనసాగిస్తూ ఉంది.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకునే లావణ్య త్రిపాఠి తాజాగా పింక్ కలర్ చీర కట్టి, మ్యాచింగ్ చెవి దిద్దులు పెట్టుకుని చిరు మందహాసం తో చూపరుల దృష్టిని ఆకర్షించింది. చీర కట్టు లో లావణ్య త్రిపాఠి ని చూస్తూ ఉంటే చూపు తిప్పుకోలేకుండా ఉన్నాం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫోటోకు లావణ్య ఇన్ స్టాగ్రామ్ లో... చిన్ననాటి జ్ఞాపకాలు, అమ్మ యొక్క పింక్ చెవి దిద్దులు లు ధరించాను. నేను ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. ఇకపై ఇవి నావే అంటూ చాలా సంతోషంగా లావణ్య త్రిపాఠి కామెంట్ పెట్టింది.
తల్లి చెవి దిద్దులను పెట్టుకున్న లావణ్య త్రిపాఠి మురిసిపోవడం చూసి నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. తల్లిపై లావణ్య కు ఉన్న అభిమానం మరియు ప్రేమ ఇందులో కనిపిస్తున్నాయి అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.