భాస్కర్ తో రొమాన్స్ మీనాక్షికా?
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'లక్కీ భాస్కర్' తెకెక్కుతున్న సంగతి తెలిసిందే
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'లక్కీ భాస్కర్' తెకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ గా సాక్షి వైద్యని తీసుకోవాలనుకున్నారు. ఆమెతో సంప్రదింపులు జరిపారు. ఆమె లాక్ అయినట్లు ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా హీరోయిన్ రేసులో మీనాక్షి చౌదరి వచ్చింది. సాక్షి స్థానంలో మీనాక్షిని ఎంపిక చేసినట్లు తాజా సమాచారం.
ఇప్పటికే కథా చర్చలు..మీనాక్షితో సమావేశం కూడా ముగిసిందిట. నిర్మాతలు అమ్మడికి అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు తెలిసింది. దీంతో మీనాక్షి ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్ పడినట్లు అయింది. ఇప్పటికే మీనాక్షి వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం అమ్మడి ఖాతాలో మూడు సినిమాలున్నాయి. వరుణ్ తేజ్ తో 'మట్కా'..విశ్వక్ సేన్ కొత్త సినిమాలోనూ ఈ భామనే నాయికగా ఎంపిక చేసారు.
ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ నటిస్తోన్న 'గుంటూరు కారం'లోనూ మెయిన్ లీడ్ కి ఎంపికైంది. పూజాహెగ్డే ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో మీనాక్షిని తీసుకున్నారు. తాజాగా దుల్కర్ తోనూ రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకోవడంతో మీనాక్షి పేరు నెట్టింట మరోసారి మారుమ్రోగి పోతుంది. వరుస అవకాశాలు ఎలా సాధ్యమవుతున్నాయంటూ? ఆసక్తికర చర్చకు అమ్మడు తెర తీసింది.
మీనాక్షి మంచి పెర్పార్మర్. తొలి సినిమా 'ఇచట వాహనములు నిలుపరాదు'తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. త్రివిక్రమ్ అమ్మడి ని తెగ పొగిడేసాడు. వెంటనే 'ఖిలాడీ'..'హిట్' సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఖిలాడీ ప్లాప్ అయినా హిట్ మంచి పేరు తీసుకొచ్చింది. అమ్మడి వేగం చూస్తుంటే స్టార్ లీడ్ కి చాలా దగ్గరగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సినిమాలన్ని హిట్ అయితే ఆ స్థానం సునాయసాంగా చేరుకుంటుంది. ఆ తర్వాత బ్యూటీ పారితోషికం పెంచేస్తుంది. ప్రస్తుతం టైర్ -2 హీరోలకు మీనాక్షి మంచి ఆప్షన్ గా చెప్పొచ్చు. పారితోషికం పరంగానూ అందుబాటులో ఉన్న హీరోయిన్.