హాట్ బ్యూటీ మాస్ రాజా టైపులా ఉందే!
మాస్ మహారాజా లైఫ్ గురించి చెప్పే లెక్చర్ గురించి తెలిసిందే. ఉన్నంతలో సంతోషంగా ఉండాలి
మాస్ మహారాజా లైఫ్ గురించి చెప్పే లెక్చర్ గురించి తెలిసిందే. ఉన్నంతలో సంతోషంగా ఉండాలి. అనవసరమైన డ్రీములు..కలల జోలికి పోయి లేని పోని సమస్యలు తెచ్చుకోవద్దని చెబుతుంటాడు. లైఫ్ అంటే ఏదో అనుకుంటామని...కానీ ఆ లైఫ్ లో ఏమీ ఉండదని....ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలి. ఆ మాత్రం దానికి ఏదేదో ఊహించుకుని ఉన్న జీవితాన్ని నాశనం చేసుకోవడం దేనికని ఓ ఇంటర్వ్యూలో అన్నాడు.
తాజాగా ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా పటేహీ కూడా అలాగే లెక్చర్ ఇస్తుంది. జీవితాన్ని అనవసరంగా ఒత్తిడిలోకి తోసేసి చిన్నాభిన్నం చేసుకుంటున్నారంది. పెద్ద హీరోయిన్లు ఛాన్సులు రావడం లేదని ..సక్సెస్ లేదని చాలా హాయిరానా పడుతుంటారు. సినిమా ఆడలేదని దిగాలుగా ఉండటం..తినడం మానే యడం వంటివి చేస్తుంటారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడిలోకి జారుకుంటున్నారు. కానీ నేను వారిలో ఉండను. జీవితం చాలా చిన్నది.
ఏ విషయాన్ని అయినా పాజిటివ్ గా తీసుకోవాలి. అది కష్టమైన..నష్టమైనా..లాభమైనా! ఒకేలా ఉంటాను. సినిమాలకి మన మనస్సును..శక్తిని ...ధైర్యాన్ని ముక్కలు చేసే శక్తినివ్వకూడదు. ప్రతిభకు తగ్గ అవకాశాలు ఆలస్యంగా వస్తాయి. వాటి కోసం ఎదురుచూడాలి. కొంత ప్రయత్నం చేయాలి. అంతేగానీ అంతకుమించి అనవసరమైన ఆలోచనలతో ఆరో గ్యాన్ని నాశనం చేసుకోవద్దు' అని హితవు పలికింది.
ఎవరో మన ప్రతిభను గుర్తించే వరకూ వెయిట్ చేయడం కన్న ఉన్న పరిదిలో ప్రయత్నించి అవకాశాలు అందుకోవాలి. రాకపోతే ఆ విషయాన్ని అంతే పాజిటివ్ గా తీసుకుని వదిలేయాలి అని తెలిపింది. ఇక అమ్మడి కెరీర్ సంగతి చూస్తే గతేడాది పూర్తిగా ఖాళీగా ఉంది. చేతిలో అవకాశాలు లేకపోవడంతో ఇన్ స్టాలో ఎక్కువగా కనిపించింది. కానీ కొత్త ఏడాదిని మాత్రం హుషారుగానే ప్రారంభించింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో నాలుగైదు ఛాన్సులున్నాయి. అలాగే తెలుగులో 'మట్కా'లోనూ నటిస్తోంది.