ఆ బ్యూటీకి వారంలో ఐదు రోజులు అదే పనా?
బేసిక్ గానే అమ్మడికి చల్లని ప్రదేశాలు అంటే ఎక్కువ ఇష్టమట. అందుకే మంచు ప్రదేశాలకు వెకేషన్లకు వెళ్లడానికి ఆసక్తిగా ఉంటుందిట
ప్రగ్యాజైశ్వాల్ గురించి పరిచయం దేనికి. అమ్మడి గురించి అంతా అందరికీ తెలిసిదే. సినిమా విషయాలు పక్కనబట్టి వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటే...అమ్మడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో నెట్టింట దర్శనమిస్తుంది. రంగుల్లో ఎరుపు..నలుపు అంటే ఎంతో ఇష్టమట. వీలైనంత వరకూ ఆ రంగు దుస్తులు ధరించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుందిట. మృదువైన చర్మం కోసం ఐస్ బాత్ చేస్తుందిట.
బేసిక్ గానే అమ్మడికి చల్లని ప్రదేశాలు అంటే ఎక్కువ ఇష్టమట. అందుకే మంచు ప్రదేశాలకు వెకేషన్లకు వెళ్లడానికి ఆసక్తిగా ఉంటుందిట. అక్కడ స్కేటింగ్ తప్పక చేస్తుందిట. అక్కట ఆట పాట ఎంతో సరదాగా ఉంటాయంది. జంక్ పుడ్ అనేది చాలా రేర్ గా తీసుకుంటుందిట. అప్పుడు మాత్రం వాటిని కడుపు నిండా ఎంచక్కా లాగిచేస్తుందిట. అలాగే వారానికి ఐదు రోజులు తప్పకుండా జిమ్ చేస్తుందిట.రకరకాల వర్కౌట్లు చేస్తుందిట. మిగిలిన రెండు రోజులు విరామం ఇస్తుందిట. ఖాళీ సమయంలో ఎక్కువగా చేసే మరోపని స్విమ్మింగ్ చేయడం అట.
సమయం దొరికితే సూటు వేసుకుని ఈత కొలనులోకి దిగేస్తుందిట. అలాగే బీచ్ లో ఆడుకోవడం అన్నా అంతే ఇష్టమట. అక్కడ ఇసుకు గుడులు..బొమ్మలు చేయడం చాలా సరదాగా ఉంటుందంది. ఇక అమ్మడి టాలీవుడ్ జర్నీ చూస్తే..'మిర్చి లాంటి కుర్రాడు' నుంచి 'సన్నాఫ్ ఇండియా' వరకూ పడతా లేస్తా సినిమాలు చేసింది. అంతకు ముందే కోలీవుడ్ లో ఎంట్రీ.. ఆ తర్వాత బాలీవుడ్ లోనూ లాంచ్ అయింది. ఈ రెండు భాషలకంటే బెటర్ గా తెలుగులోనే సినిమాలు చేసింది.
అలాగే అనుకున్నట్లుగానే తన తొమ్మిదేళ్ల క్రితం నాటి కల నిజమయ్యే మరో అవకాశం అందుకుంది. అక్షయ్ కుమార్ ..తాప్సీ ..వాణీ కపూర్ నటిస్తోన్న 'ఖేల్ ఖేల్ మే' చిత్రంలో ప్రగ్యా అవకాశం అందుకుంది. ఇందులో అమ్మడు ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అక్షయ్ కుమార్ తో పోటా పోటీ సన్నివేశాలున్నాయని సమాచారం. ఈ చిత్రాన్ని ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇది ఓ ఇటాలియన్ సినిమా కి రీమేక్ గా రూపొందుతుంది.