ఒలింపిక్స్ ముందు అథ్లెట్ లా గ్లోబ‌ల్ స్టార్!

ప్రాన్స్ లో ఒలింపిక్స్ వారం రోజుల క్రితం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌మంతా ఇప్పుడు ఒలింపిక్స్ లోనే మునిగిపోయింది

Update: 2024-08-01 11:17 GMT

ప్రాన్స్ లో ఒలింపిక్స్ వారం రోజుల క్రితం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌మంతా ఇప్పుడు ఒలింపిక్స్ లోనే మునిగిపోయింది. అథ్లెట్ లు మ‌న దేశానికి ఎలాంటి ప‌త‌కాలు తీసుకురాబోతున్నారు? అన్న ఎగ్జైట్ మెంట్ తో అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా అథ్లెట్ల‌ తో అల్లాడుతుంది. గెలిచిన వాళ్ల‌ను...గ‌త రెండు సంవ‌త్స‌రాల విజేత‌ల్ని సైతం సోష‌ల్ మీడియా గుర్తు చేస్తూ అభిమానుల్లో ఎగ్జైట్ మెంట్ తీసుకొస్తుంది.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా నేను సైతం అంటూ అథ్లెట్ లా ముస్తాబైన ఓ సెల్పీని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇదిగో ఇక్క‌డిలా స్కిన్ టైట్ స్పోర్స్ట్ దుస్తుల్లో అచ్చంగా అథ్లెట్ నే మ‌రిపించింది. బ్లాక్ అండ్ క్రీమ్ క‌ల‌ర్ కాంబినేష‌న్ దుస్తుల్లో అమ్మ‌డు స్కిన్ షో చేసింది. కాళ్ల‌కు షూస్..మోకాలికి, మోచేతుల‌కి సేప్టే బ్యాండ్స్ ధ‌రించి సెల్పీ దిగింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గామారింది.

పీసీ కూడా మంచి ఫిట్ నెస్ ప్రీక్ అన్న‌సంగ‌తి తెలిసిందే. డైలీ వ‌ర్కౌట్లు క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తుంది. నిరంత‌రం శ‌రీరాన్ని ఫిట్ గా ఉంచుకుటుంది. హాలీవుడ్కి వెళ్లిన త‌ర్వాత మ‌రింత శ్ర‌ద్ద వ‌హిస్తుంది. ఇక అమ్మ‌డు స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో బాక్స‌ర్ `మేరికోమ్` బ‌యోపిక్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాతో పీసీకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది.

మేరికోమ్ పాత్ర‌లో అమ్మ‌డు ఒదిగిన విధానం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కురిపించింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఆ సినిమా మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. ఆ విజ‌యం స్పూర్తితో మ‌రింత మంది అథ్లెట్ క‌థ‌ల్ని బాలీవుడ్ ద‌ర్శ‌కులు తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News