ఇంటర్నేషనల్ హీరోయిన్ల పక్కనే ఆ భామకి కుర్చీ!
నికోలస్ సెలిస్ లోఫేజ్..డాయానా ఇలియేజ్..ర్యాన్ హ్యాంగ్ లాంటి అంతర్జాతీయ నటీమణుల సరసన కూర్చోవాలంటే? ఓ స్థాయి ఉండాలి
నికోలస్ సెలిస్ లోఫేజ్..డాయానా ఇలియేజ్..ర్యాన్ హ్యాంగ్ లాంటి అంతర్జాతీయ నటీమణుల సరసన కూర్చోవాలంటే? ఓ స్థాయి ఉండాలి. ఆ రేంజ్ హీరోయిన్లకు మాత్రమే వాళ్ల పక్కన ఓ కూర్చునే అర్హత ఉంటుంది. అంతటి ప్రతిభావంతులు ఇండియా నుంచి ఎవరంటే? గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. ఐశ్వర్యా రాయ్.. దీపికా పదుకోణే లాంటి భామలకే సాధ్యమవుతుంది. ఆ తర్వాత మరికొంత మంది సీనియర్ నాయికలకే ఆ అర్హత ఉంటుంది.
కానీ వాళ్లకే దక్కని అవకాశం బాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాధికా మదన్ కి దక్కింది. ప్రతిష్టాత్మక టాలిన్ బ్లాక్ నైట్స్ ఫిల్మ్ పెస్టివల్స్ లో న్యాయనిర్ణేతల బృందంలో ఇండియా నుంచి రాధికా మదన్ ని ఎంపిక చేసారు. ఇందులో పైన పేర్కన్న హాలీవుడ్ నటీమణులంతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగమయ్యే అరుదైన అవకాశం ఇండియా నుంచి ఎంపికైన మొదటి భారతీయు రాలు కూడా రాధిక కావడం విశేషం.
ఎస్తోనియాలో టాలిన్ నగరంలో నవంబర్ 9 నుంచి ఈ చిత్రోత్సవంలో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన సినిమా లన్నింటిని ప్రదర్శిస్తారు. ఈ అరుదైన అవకాశం పట్లా రాదిక మదన్ సంతోషం వ్యక్తం చేసింది. న్యాయని ర్ణేతగా ఎంపికవ్వడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అంతర్జాతీయ సినీ ప్రముఖులతో కలిసి పనిచేయ డం మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. ఈ అవకాశం ఇచ్చిన అకాడమీ సభ్యులకు ధన్యవాదాలు` తెలియజేసింది.
ఇక ఐశ్వర్యారాయ్...దీపికా పదుకొణే లాంటి అగ్ర నటీమణులు అంతర్జాతీయ ఈవెంట్లలో చాలా సార్లు భాగమయ్యారు. కొన్ని అంతర్జాతీయ అకాడమీలు వాళ్లని కమిటీ సభ్యులుగా తీసుకున్న సందర్భాలు న్నాయి. ప్రఖ్యాత కేన్స్ ఉత్సవాల్లో సైతం ఐశ్వర్యారాయ్ కీలక పాత్ర పోషించింది. గౌరవ ప్రదమైన బాద్యతలు నిర్వర్తించారు.