బెజ‌వాడ బ్యూటీ లండ‌న్ లో ఎండీ చేస్తోందా?

రూప కొడువాయూర్ పేరు చూసి కేర‌ళ కుట్టినో? చెన్నై సోయ‌గ‌మా? అనుకునేరు. అచ్చ‌మైన తెలుగ‌మ్మాయే.

Update: 2023-09-02 14:49 GMT

రూప కొడువాయూర్ పేరు చూసి కేర‌ళ కుట్టినో? చెన్నై సోయ‌గ‌మా? అనుకునేరు. అచ్చ‌మైన తెలుగ‌మ్మాయే. `ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌స్య‌` సినిమాతో అమ్మ‌డు టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. తొలి సినిమాతోనే చ‌క్క‌ని న‌టి అనిపించింది. అటుపై ఇటీవ‌లే రిలీజ్ అయిన `మిస్ట‌ర్ ప్రెగ్నెంట్` లోనూ న‌టించింది. ఈ సినిమా నేరుగా థియేట‌ర్లో రిలీజ్ అవ్వ‌డంతో అమ్మ‌డు బాగా ఫోక‌స్ అయింది.

సొగ‌స‌రి అంద‌చందాల‌తో యువ‌త‌ని ఆక‌ర్షించింది. స్క్రీన్ ప్ర‌జెన్స్ బాగుంది. దీంతో ఎవ‌రీ బ్యూటీ? ఎక్క‌డ నుంచి దిగొచ్చింది? అని నెట్టింట చిన్న చ‌ర్చ సాగింది. తాజాగా ఈ బ్యూటీ ఏకంగా అప్పుడే లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌కు ప్ర‌మోట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు రూప కొడవయూర్ లీడ్ రోల్ లో నటించిన ఓ యాక్షన్ సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ డిసెంబర్లో తెలుగు, తమిళ్ లో రిలీజ్ అవుతుంద‌ని సమాచారం.

ఆ ప్రాజెక్ట్ పూర్తి వివ‌రాలు ఇదే నెల‌లో రివీల్ చేసే అవ‌కాశం ఉంది. ఈసినిమా ఓ పాన్ ఇండియా సంస్థ ద్వారా రిలీజ్ అవుతుంద‌ని స‌మాచారం. ఈ అమ్మ‌డు మంచి న‌టే కాదు. చ‌క్క‌ని క్లాసికల్ డ్యాన్సర్ కూడా. చ‌దువుల్లోనూ ముందుంది. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయింది. వృత్తిరిత్య డాక్టర్ అయిన రూప న‌ట‌న‌పై మ‌క్కువ‌తో మేక‌ప్ వేసుకుంది. అయినా చ‌దువు ఆప‌లేదు. అమ్మ‌డు లండ‌న్ లో డాక్ట‌ర్ ఆఫ్ మెడిస‌న్ చేయ‌డానికి రెడీ అయింది.

ఆ ప‌రీక్ష‌లు కూడా పూర్తిచేసి ఎండీ ప‌ట్టా కూడా అందుకోవాల‌ని ఆశ‌ప‌డుతుంది. రూప స్వ‌స్థ‌లం విజయవాడ. ఈ అమ్మ‌డు కూడా టాలీవుడ్ లో బిజీ న‌టి అవ్వాల‌ని ఆశిద్దాం. తెలుగు అమ్మాయిలు ప‌రిశ్ర‌మ‌కు రావాల‌ని బ‌న్ని లాంటి వాళ్లు ప్రోత్స‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `బేబి` విజ‌యంతో వైష్ణ‌వికి మంచి పేరొచ్చింది. ప‌రిశ్ర‌మ‌లో మంచి అవ‌కాశాలు వ‌స్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఆ కోవ‌లో రూప కూడా నిల‌వాల‌ని ఆశిద్దాం.

Tags:    

Similar News