సమంత సాహసోపేతమైన నిర్ణయం తెలిస్తే షాక్!
నిజానికి మయోసైటిస్ గురించి చాలామందికి అవగాహన లేదు. భారతదేశంలో దీని గురించి మొదటిసారి వినడం కూడా ఇదే
బ్రెస్ట్ క్యాన్సర్ గురించి విస్త్రతంగా ప్రజలకు అవగాహన ఉంది. ప్రమాదకర మహమ్మారీపై ప్రచారం చేయడంలో సెలబ్రిటీలు ఇతోధికంగా తమవంతు కృషి చేసారు. మనీషా కొయిలారా- సోనాలి బింద్రే- మమతా మోహన్ దాస్- హంసా నందిని- మహిమా చౌదరి- లీసారే-తాహిరా కశ్యప్ సహా చాలామంది సెలబ్రిటీలు బ్రెస్ట్ క్యాన్సర్ భారిన పడి చికిత్సతో కోలుకున్నవారే. వీరంతా మహమ్మారీ గురించి విస్త్రతంగా ప్రచారం చేయడంలో ఎంతో కృషి చేసారు.
అయితే ఇప్పుడు అరుదైన మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత కూడా ఇకపై ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించనున్నారని తెలిసింది. సిటాడెల్- ఖుషి చిత్రీకరణ సమయంలోను రెండో సారి మయోసైటిస్ వల్ల సమంత తీవ్రంగా ఇబ్బంది పడ్డారని గుసగుసలు వినిపించాయి. అదే క్రమంలో అమెరికాలో చికిత్స తీసుకున్నారు. కానీ ఇంకా తనకు పూర్తి స్థాయి చికిత్స అవసరం.
తాజా సమాచారం మేరకు ఏడాది పాటు సమంత మయోసైటిస్ కి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని, అంతవరకూ సినిమాల్లో నటించరని ప్రచారం సాగుతోంది. తాజా పరిణామంతో ఇప్పటికే నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్ లను సమంత తిరిగి వెనక్కి ఇచ్చేశారని కూడా గుసగుస వినిపిస్తోంది. అంతేకాదు ఈ ఏడాది అంతా సమంత స్వయంగా మయోసైటిస్ గురించి ప్రజల్లో విస్త్రత ప్రచారం కల్పించనున్నారని తెలుస్తోంది.
నిజానికి మయోసైటిస్ గురించి చాలామందికి అవగాహన లేదు. భారతదేశంలో దీని గురించి మొదటిసారి వినడం కూడా ఇదే. సమంత వల్ల మాత్రమే ఈ వ్యాధి గురించి రివీలైంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సమంత ప్రస్తుతం మయోసైటిస్ గురించి అవగాహనా ప్రచారం చేయడంలో నిమగ్నం కానున్నారని తెలుస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్ తరహాలో మయోసైటిస్ గురించి ప్రపంచానికి అవగాహన పెంచడం అత్యావశ్యకంగా సామ్ భావిస్తోందట.