సౌందర్య అంత పెద్ద స్టార్ ఎలా అయింది?
10వ తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే తన తండ్రి షూటింగ్ కి వెళ్దామని చెప్పారుట. దీంతో తాను సినిమాలు చేయనని ఏడ్చేసినట్లు చెప్పింది.
సౌందర్య తెలుగు తెరపై చెరగని సంతకం..అందం..అభినయం కలబోసిన ఓ అద్భుతం. ఒకతరం మహిళా ప్రేక్షకుల్ని ప్రభావితం చేసిన గొప్ప నటి. మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయి నటిగా గుర్తింపు దక్కించుకు న్న నటి. చిలిపిదనపు పాత్రలతో పరిచయమై.. అటుపై దక్షిణాది సినిమాకే ఆప్తమిత్రురాలిగా మారిపోయింది. సావిత్రి తర్వాత తిరుగులేని మహిళా అభిమానుల్ని సంపాదించుకున్నఏకైక నటి. సహజ సౌంద ర్యం ఆభరణంగా పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి.
చారడేసి కళ్లు..గులాబీ చెక్కిళ్లు..చెక్కు చెదరని చిరునవ్వు.. చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం కలిపేస్తే కనిపించే రూపం సౌందర్య. నాజూకైన అందం ... అసాధారణమైన అభినయం ... అంతకు మించిన వ్యక్తిత్వం సౌందర్యకు ఆభరణాలు.. సిల్వర్ స్క్రీన్ పై ఈ అందాలబొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోయేది. ఓ దశలో సౌత్ లో నెంబర్ హీరోయిన్ గా వెలుగొందింది. సౌందర్య పరిశ్రమకి వచ్చేసరికి ఇక్కడంతా గ్లామర్ నాయికల హవా నడుస్తుంది.
వాళ్లని సైతం పక్కకు నెట్టేసి అనతి కాలంలోనే సౌందర్య బ్రాండ్ వేసింది. మనవరాలి పెళ్లి నుంచి శివ శంకర్ వరకూ తెలుగు తెరపై తనదైన నటనతో వెలిగిపోయింది. మరి అంతటి ప్రతిభావంతురాలు..అందం సినిమాల్లోకి ఎలా వచ్చింది? అంటే ఓ ఇట్రెస్టింగ్ విషయం తెలుస్తుంది. అందుకు సౌందర్య పాత వీడియో లు సరైన సమాధానం దొరుకుతుంది. అందులో తాను ఎలా సినిమాల్లోకి వచ్చిందో రివీల్ చేసారు.
10వ తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే తన తండ్రి షూటింగ్ కి వెళ్దామని చెప్పారుట. దీంతో తాను సినిమాలు చేయనని ఏడ్చేసినట్లు చెప్పింది. కానీ తండ్రి ధైర్యం చెప్పి షూటింగ్ సెట్స్ కి తీసుకెళ్లారుట. అక్కడ సెట్ లో జనాలు...లైట్స్ చూసి కంగారు పడినట్లు చెప్పింది. అప్పుడు తనకేం అర్దం కాలేద ని..డైరెక్టర్ చెప్పినట్లు చేసి ఇంటికి వచ్చేసానంది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వాటంతటవి రావడంతోనే తాను యాక్టిగ్ రంగంలో కొనసాగినట్లు తెలిపారు.