తప్పక తప్పించుకుంటోన్న బ్యూటీ!
ఫేం లో ఉన్నంత కాలమే ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేది. ఎన్నికోట్లు సంపాదించడానికైనా అదే సరైన సమయం. యువ నాయిక శ్రీలీల ఇప్పుడదే ఫేజ్ లో ఉంది
ఫేం లో ఉన్నంత కాలమే ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేది. ఎన్నికోట్లు సంపాదించడానికైనా అదే సరైన సమయం. యువ నాయిక శ్రీలీల ఇప్పుడదే ఫేజ్ లో ఉంది. వరుస విజయాలతో దూసుకుతోన్న సొగసరికి టాలీవుడ్ పెద్ద పీట వేసింది. ఎంత మంది భామలున్నా దర్శక-నిర్మాతలంతా ఆమె వెంటే పడుతున్నారు. మా సినిమాల నటించండి. ఎంత పారితోషికమైనా ఇస్తాం. మా సినిమాకి డేట్లు కేటాయించండి అంటూ వెంట పడుతున్నారు.
అందుకు తగ్గట్టే శ్రీలీల కూడా వాళ్ల సినిమాలకు డేట్లు కేటాయిస్తుంది. వీలైనంత వరకూ ఎవర్నీ బయటకు వెళ్లనివ్వడం లేదు. తనవద్ద లాక్ చేసి పెడుతుంది. కానీ అలా అన్నివేళలా కుదరదు కదా. తప్పక తప్పించుకోవాల్సిన సన్నివేశం ఒకటుంటుంది. ఈ అమ్మడు ఇప్పుడు అదే పరిస్థితుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల క్షణం తీరక లేకుండా గడుపుతుంది. డే అండ్ నైట్ షూటింగ్ లకు హాజరవుతుంది. 2024 షెడ్యూల్ అంతా బిజీ.
లైనప్ లో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి 2024 సరిపోతుంది. ఆ తర్వాత 2025 లో చేయాల్సిన ప్రాజెక్ట్ లకు సంబంధించి ఓ ప్రణాళిక వేసుకుంది. ఆ ఏడాది క్యాలెండర్ కూడా నిండింది. అధికారికం ఏ సినిమాలు చేస్తుంది అన్నది ప్రకటించలేదు గానీ 2025 క్యాలెండర్ కూడా ఫుల్ అయిందని సమాచారం. ఈ నేపథ్యంలో వస్తోన్న కొత్త అవకాశాలకు సైన్ చేయలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దర్శక-నిర్మాతల్ని తప్పించుకుని తిరగాల్సి వస్తోందిట.
అంతా తెలిసిన వారే కావడంతో! నో చెప్పలేక పోతుందిట. ఎలాంటి బధులు ఇవ్వాలో తెలియక వీలైనంత కనిపించకుండా ఉంటేనే బెటర్ అని స్కిప్ కొడుతుందిట. ఒప్పుకుని ఇబ్బంది పెట్టడం..తాను ఇబ్బంది పడటం కన్నా ఇలా స్కిప్ కొడితే వాళ్లు కూడా అంతగా నొచ్చుకోరని ఇలాంటి మార్గాన్ని అనుసరిస్తుందని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ విషయంలో కూడా శ్రీలీల కూడా డేట్లు ఇవ్వలేకపోతున్నాని లోలోపన మదన పడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఏం జరిగినా అంతా మన మంచికే అని ఊరుకోవడం తప్ప అమ్మడి చేతుల్లో కూడా ఏం లేదని తెలుస్తుంది.