సాయంత్రం సినిమా..వీధి చివ‌ర దోశెలు..ఆ లైఫ్ సూప‌ర్!

అప్పుడ‌ప్పుడు ఆ జీవితంలోకి వెళ్లిపోవాల‌నిపిస్తుంది. ఇప్ప‌టి లైఫ్ స్టైల్ తో పోలిక చేస్తే చిన్న‌ప్పుడే ఎంతో బాగుండేది

Update: 2024-04-15 13:30 GMT
సాయంత్రం సినిమా..వీధి చివ‌ర దోశెలు..ఆ లైఫ్ సూప‌ర్!
  • whatsapp icon

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అప్ప‌టి జీవితం ఇప్పుడు కావాల‌నుకున్నా తిరిగి రాదు. చేతిలో బబ్బున్నా లేక‌పోయినా అప్ప‌టి జీవితం ఎంతో గొప్ప‌గా ఉడేద‌ని స‌క్సెస్ అయిన చాలా మంది చెప్పే మాట‌. అందులోనూ బాల్య జీవితం గురించైతే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌తీ ఒక్క‌రి బాల్య జీవితం ఓ మ‌దుర జ్ఞాప‌కం. తాజాగా వెంటరన్ న‌టి ట‌బు ఆనాటి జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోయింది. 1975-76 కాలంలో త‌న జీవితం ఎలా ఉండేదో? గుర్తు చేసుకున్నారు. 75-76 ప్రాంతంలో చిన్నప్పుడు అమ్మమ్మతో- కజిన్స్‌తో క‌లిసి సాయంత్రాల్లో సినిమా చూడటం- వీధి చివర దోశలు తినటం బాగా గుర్తు.

అప్పుడ‌ప్పుడు ఆ జీవితంలోకి వెళ్లిపోవాల‌నిపిస్తుంది. ఇప్ప‌టి లైఫ్ స్టైల్ తో పోలిక చేస్తే చిన్న‌ప్పుడే ఎంతో బాగుండేది. ఎలాంటి టెన్ష‌న్ లు ఉండేవి కాదు. ఎదిగే కొద్ది అన్ని స‌మ‌స్య‌లేన‌ని వ‌య‌సుతో పాటు అర్ద‌మ‌వుతుంది. అమ్మ‌మ్మ‌తో జ్ఞాప‌కాలు అన్నీ ఇన్ని కావు. బాల్యంలో ప్ర‌తీది ఎంతో గొప్ప మూవ్ మెంట్. మా అమ్మమ్మతో సంభాషించేప్పుడు సినిమాల కంటే ఉర్దూ కవిత్వమే డామినేట్‌ చేసేది. ఆమె బాల్యం అంటే హైద‌రాబ‌ద్ తో ఆమెకున్న బంధం గురించి గుర్తు చేయాలి.

టబు నేపథ్యం హైదరాబాద్‌తో ముడిపడి ఉంటుంది. ఆమె హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. పూర్తి పేరు తబస్సుమ్‌ ఫాతిమా హష్మీ. తన తండ్రి పాకిస్తాన్‌ నటుడు. పేరు జమాల్‌ అలీ హష్మీ. తల్లి పేరు రిజ్వానా. అయితే ట‌బు తల్లి నుంచి విడిపోయాక అమ్మమ్మతో కలసి ఉంది. హైదరాబాద్ లో కొంతకాలం అనంత‌రం అక్క‌డ నుంచి మనాలి వెళ్లిపోయిన‌ట్లు గ‌తంలో ఓ ఇంట‌ర‌వ్యూలో రివీల్ చేసారు. `అక్కడ ఓ రెండు పెంపుడు కుక్కలు- చేపలు నా ప్రపంచం. మా పూర్వీకులు అంతా చదువుకున్నవాళ్లే. అమ్మమ్మ దగ్గర ప్రపంచం అర్థమైంది. పుస్తకాల నుంచి ఉర్దూ కవిత్వం వరకూ చదివా` అని అన్నారు.

ప్ర‌స్తుతం ట‌బు సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. ఇటీవ‌లే ది క్రూ సినిమాతో భారీ స‌క్సెస్ అందుకుంది. ఈ సినిమా వంద కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఇది ఫీమేల్ ఓరియేంటెడ్ చిత్రం. ట‌బుతో పాటు కృతిస‌న‌న్ ..క‌రీనా క‌పూర్ న‌టించారు.

Tags:    

Similar News