పురి విప్పిన నెమ‌లి అందంలో ఐష్!

కేన్స్ ఉత్స‌వాల్లో బాలీవుడ్ భామ‌లంతా త‌ళుక్కున మెరుస్తున్నారు? మ‌రి అంద‌రి క‌ల‌ల రాణి ఎక్క‌డ‌? అంటూ అంతా సెర్చ్ చేస్తోన్న త‌రుణం.

Update: 2024-05-18 12:10 GMT

కేన్స్ ఉత్స‌వాల్లో బాలీవుడ్ భామ‌లంతా త‌ళుక్కున మెరుస్తున్నారు? మ‌రి అంద‌రి క‌ల‌ల రాణి ఎక్క‌డ‌? అంటూ అంతా సెర్చ్ చేస్తోన్న త‌రుణం. ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్ కేన్స్ రెడ్ కార్పెట్ పై త‌ళుక్కున మెరిసింది. ఈ సారి ఏకంగా డ‌బుల్ ట్రీట్ ఇచ్చింది. రెండుసార్లు సార్టు రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయింది. ఒక డిజైన్ లో ఏకంగా పురి విప్పిన నెమ‌లినే త‌ల‌పించింది. పీకాక్ వాక్ చేస్తే ఎంత అందంగా ఉంటుందో? కార్పెట్ పై ఐశ్వ‌ర్య వాక్ చేసినా అంతే అందంగా ఉంటుంద‌ని ప్రూవ్ చేసింది.


ఆమె అల‌కంర‌ణ‌...డ్రెస్ డిజైన్ ప్ర‌తీది మ‌రోసారి ఐష్ ప్ర‌త్యేక‌త‌ను చాటింది. ఆ బ్యూటీలో ఐశ్వ‌ర్య మిరుమిటులు గొలిపింది. డ్రెస్ డిజైన్ ఆద్యంతం క‌నుల‌కు షైనింగ్ తీసుకొచ్చింది. ఐశ్వ‌ర్యా రాయ్ చేతికి క‌ట్టుతో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఆ క‌ట్టు చేతికి అలాగే ఉంది. ఈవెంట్ లో పాల్గోనే స‌మ‌యంలో తొల‌గిస్తుంద‌నుకున్నారంతా? కానీ గాయం ఇంకా మానిన‌ట్లు లేదు. అందుకే క‌ట్టుతోనే కార్పెట్ పై వాక్ చేసింది. ఇక కేన్స్ లో ఐశ్వ‌ర్యా రాయ్ మెంబ‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే.

ఏటా క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ వేడుక‌ల్లో త‌ప్ప‌క మెరుస్తుంది. బాలీవుడ్ నుంచి ఏ హీరోయిన్ ఉన్నా లేక‌పోయినా ఐశ్వ‌ర్య మాత్రం త‌ప్ప‌కుండా కేన్స్ లో భాగ‌మ‌వుతుంది. ఈ ఏడాది కుమార్తె ఆరాధ్య‌తో వేడుక‌ల‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ ఈవెంట్ కి సంబంధించిన ఐశ్వ‌ర్య రాయ్ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. అయితే ఐశ్వ‌ర్య ఎంపిక చేసుకున్న డిజైన్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ..ఆమె రూప లావ‌ణ్యంలో వ‌చ్చిన మార్పుల‌పై నెగిటివిటీ వ్య‌క్తం అవుతోంది.

చాలా కాలంగా ఈ విమ‌ర్శ‌ల్ని ఐశ్వ‌ర్య మోస్తూనే ఉంది. ఇక సినిమాల ప‌రంగా కూడా అమ్మ‌డు వెనుక బ‌డిన సంగ‌తి తెలిసిందే. పొన్నియ‌న్ సెల్వ‌న్ త‌ర్వాత మ‌ళ్లీ వ‌రుస‌గా సినిమాలు చేస్తుంద‌ని భావించారంతా. కానీ ఆమెకి ఆర‌కంగా అవ‌కాశాలు వ‌చ్చినా చేయ‌లేదా? రాక చేయ‌లేదా? అన్న‌ది స‌స్పెన్స్.

Tags:    

Similar News