ఆ హీరోకి భార్య‌గా ఛాన్స్ కొట్టేసిన ఐశ్వ‌ర్య‌!

మ‌రి మ‌రో హీరోయిన్ సంగ‌తేంటి? అంటే ఆ పాత్ర‌కు ఐశ్వ‌ర్యా రాజేష్ ని ఎంపిక చేసారుట‌.

Update: 2024-07-02 06:15 GMT

విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `సంక్రాంతి వ‌స్తున్నాం` అనే చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. `రానా నాయుడు -2` వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తికాగానే వెంక‌టేష్ ఈ చిత్రాన్నే ప‌ట్టాలెక్కించ‌నున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోయిన్లు న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. ఓ హీరోయిన్ గా మీనాక్షి చౌద‌ర‌ని కూడా ఎంపిక చేసారు. ఇందులో మీనాక్షి ... వెంక‌టేష్ కి ప్రియు రాలి పాత్ర పోషిస్తుంద‌ని స‌మాచారం.

మ‌రి మ‌రో హీరోయిన్ సంగ‌తేంటి? అంటే ఆ పాత్ర‌కు ఐశ్వ‌ర్యా రాజేష్ ని ఎంపిక చేసారుట‌. ఇందులో అమ్మ‌డు వెంకీకి భార్య రోల్ పోషిస్తుంద‌ని అంటున్నారు. ఇద్ద‌రి భామ‌ల మ‌ధ్య‌లో ముద్దుల బావ‌గా వెంకీ పాత్ర‌ని ఆద్యంతం న‌వ్వులు పూయించడం ఖాయం. ఫ్యామిలీ స్టోరీల‌కు హాస్యాన్ని జోడించి తీయ‌డంలో అనీల్ టేకింగ్ తిరుగుండ‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ అత‌డికి వైఫ‌ల్య‌మే లేదు. ఒకేజాన‌ర్ చిత్రాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద కోట్లు కొల్ల‌గొడుతున్నాడు.

Read more!

ఈసారి వెంకీ ఫ్యామిలీ ఇమేజ్ ని తెలివిగా ఎన్ క్యాష్ చేస్తున్నాడు. అనీల్ అంటే వెంక‌టేష్ కి ఎంతో న‌మ్మ‌కం. గ‌తంలో అదే హీరోతో ఎఫ్ -2, ఎఫ్ 3 లాంటి చిత్రాలు తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ అందించాడు. వెంకీ లేడీ ఫాలోయింగ్ ని ఆరెండు చిత్రాలు మ‌రింత పెంచాయి. అందుకే మ‌రోసారి ఈ కాంబినేష‌న్ చేతులు క‌లిపింది. ఇద్ద‌రు భామ‌ల‌తో రొమాన్స్ కి వెంకీక కొత్తేం కాదు.

అయితే అన్ని చిత్రాల‌కంటే ఇంట్లో ఇల్లాలు..వంటింట్లో ప్రియురాలు చిత్రం అప్ప‌ట్లో ట్రెండ్ సెట్ట‌ర్ లా నిలిచిన సంగ‌తి తెలిసిందే. వెంక‌టేష్ రొమాంటిక్ పెర్మార్మెన్స్ తో అద‌ర‌గొట్టేసాడు. మ‌ళ్లీ చాలా కాలం త‌ర్వాత యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ స్టోరీకి రొమాంటిక్ ట‌చ్ ఇస్తూ అనీల్ సినిమా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈనెల 3 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. న‌వంబ‌ర్ క‌ల్లా షూటింగ్ పూర్తి చేయాల‌న్న‌ది ప్లాన్.

Tags:    

Similar News