ఐశ్వ‌ర్యారాయ్ విరిగిన చేతికి శస్త్ర చికిత్స‌

కొద్ది రోజులుగా మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సంద‌డి చేస్తూ కనిపించారు.

Update: 2024-05-20 05:09 GMT

కొద్ది రోజులుగా మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సంద‌డి చేస్తూ కనిపించారు. ఐశ్వ‌ర్య‌రాయ్‌తో పాటు ఈ ఉత్స‌వాల్లో కుమార్తె ఆరాధ్య బ‌చ్చ‌న్ కూడా క‌నిపించారు. ఐష్ చేతికి గాయం కార‌ణంగా సిమెంట్ క‌ట్టుతో క‌నిపించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. రెడ్ కార్పెట్ ఈవెంట్ కి వెళ్లేప్పుడు ఆరాధ్య త‌న‌కు స‌హ‌క‌రిస్తుంటే ఆ దృశ్యాలు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి.

కేన్స్ ఉత్స‌వాల్లో త‌న ప్ర‌ద‌ర్శ‌నను విజ‌య‌వంతంగా ముగించిన ఐశ్వ‌ర్యారాయ్ నిన్న‌నే ముంబైలో అడుగుపెట్టారు. అయితే ప్ర‌తిచోటా త‌న చేతికి క‌ట్టిన పెద్ద క‌ట్టు విజువ‌ల్స్ లో హైలైట్ అయింది. నిజానికి కేన్స్ ఉత్స‌వంలో ఆరాధ్య త‌న‌తో లేకుండా చాలా ఇబ్బంది ప‌డి ఉండేద‌ని కూడా చ‌ర్చ సాగుతోంది.

అయితే ఐష్ కి ఏమైంది? అంటే.. త‌న చేతి మణికట్టు విరిగిందని అయినా కానీ మొండి ప‌ట్టుద‌లతో శ‌స్త్ర చికిత్స‌కు వెళ్ల‌కుండా ముందుగా కేన్స్ ఉత్స‌వాల్లో జాయినైంద‌ని తెలుస్తోంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ త‌న ప‌ని క‌ట్టుబాట్ల కోసం రిస్క్ చేసారు. ఇప్పుడు అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. వచ్చే వారం ముంబైలో మణికట్టుకు శస్త్రచికిత్స చేయనున్నారనేది తాజా వార్త‌. నిజానికి ఐష్ కి ఉన్న ఒప్పందాల వ‌ల్ల‌ కేన్స్‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. గాయం బాధిస్తున్నా కానీ ఇచ్చిన మాట కోసం ఫ్రాన్స్ లోని కేన్స్‌కు వెళ్లార‌ని తెలిసింది. ఇప్పుడు తిరిగి ముంబైకి వ‌చ్చేసింది కాబ‌ట్టి, వచ్చే వారంలో శస్త్రచికిత్స చేస్తార‌ని తెలుస్తోంది.

ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కావడం ఆనవాయితీ. ప్ర‌తిసారీ పాపుల‌ర్ బ్రాండ్స్ కి ప్ర‌చారం క‌ల్పించిన‌ట్టే, ఈసారి కూడా ఒప్పందం ఉన్న‌ త‌న ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చారం క‌ల్పించింది. సినిమాల ప‌రంగా చూస్తే ఐష్ ఇటీవ‌ల‌ మణిరత్నం `పొన్నియిన్ సెల్వన్‌`లో కనిపించింది. త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి వెల్ల‌డించాల్సి ఉంది.

Tags:    

Similar News