ఇద్దరు సీనియర్ల మధ్య చరణ్ జూనియర్!
అటుపై రెండు రోజుల గ్యాప్ అనంతరం గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటిస్తోన్న 'డాకు మహారాజు' 12వ తేదీన రిలీజ్ అవుతుంది.
2025 సంక్రాంతికి ఇద్దరు సీనియర్ హీరోలు ఒక జూనియర్ హీరో మధ్య త్రిముఖ పోరుకు రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. మూడు రోజులు ముందుగానే సంక్రాతి ఉత్సావం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' తో మొదలు పెడుతున్నాడు. జనవరి 10న ఆ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. అటుపై రెండు రోజుల గ్యాప్ అనంతరం గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటిస్తోన్న 'డాకు మహారాజు' 12వ తేదీన రిలీజ్ అవుతుంది. మరో రెండు వ్యవధిలో విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న 'సంక్రాంతి వస్తున్నాం' రిలీజ్ అవుతుంది.
అలా ముగ్గురు హీరోలు ఈ సంక్రాంతిని షేర్ చేసుకున్నారు. అయితే సీనియర్ హీరోలతో చరణ్ సినిమా రిలీజ్ అవ్వడం అన్నది ఇదే తొలిసారి. ఓసారి ఆ సినిమాలపై అంచనాలు ఎలా ఉన్నాయో చూస్తే... 'గేమ్ ఛేంజర్' భారీపై భారీ అంచనాలున్నాయి. రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్. 1000 కోట్ల క్లబ్ లో చేరిన హీరో. రీజనల్గానూ చరణ్ ఇమేజ్ ఎంతో ప్రత్యేకమైనది. దీంతో ఆర్డర్ లో ఈ సినిమా టాప్ లో కనిపిస్తుంది. అంతే రిస్క్ కూడా ఈ సినిమాపై ఉంది.
ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ శంకర్ కి సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతుంది. చివరి సినిమా 'ఇండియన్-2' కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి బోల్తా పడిన చిత్రం. ఆ రకంగా 'గేమ్ ఛేంజర్' పై ఈ రకమైన టెన్షన్ ఉంది. ఇక 'డాకు మహారాజు' పరంగా చూస్తే అంచనాలు భారీగా ఉన్న రెండవ చిత్రం. బాలయ్య వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. ఆ సినిమా దర్శకుడు బాబి సైతం అదే స్పీడ్ లో ఉన్నాడు. గత సినిమా 'వాల్తేరు వీరయ్య' కూడా భారీ సక్సెస్ అయింది. పక్కా కమర్శియల్ చిత్రాల దర్శకుడిగా పేరుంది. దీంతో బాలయ్యకు హిట్ ఇవ్వడం ఖాయంగా ట్రేడ్ భావిస్తోంది.
ఇక వెకంటేష్- అనీల్ రావిపూడి 'సక్రాంతి వస్తున్నాం' అన్నది సేఫ్ ప్రాజెక్ట్ గా కనిపిస్తుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. వెంకీ సహా అనీల్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. డైరెక్టర్ గా అనీల్ కు ఇంత వరకూ వైఫల్యం లేదు. సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు ఫెయిలైన చరిత్ర కూడా లేదు. ఆర్డర్ ప్రకారం థర్డ్ ప్లేస్ లో కనిపిస్తున్నా? ఆ రెండింటిని మించిన సేఫ్ ప్రాజెక్ట్ ఇది. అయితే 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతి వసున్నాం' రెండు చిత్రాలను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆయన పక్కా ప్లానింగ్ తో..తన మార్క్ స్ట్రాటజీతోనే మార్కెట్ లోకి వస్తున్నారు. మరి ఈ మూడు చిత్రాల మధ్య పోటీ ఎలా ఉంటుంది? సంక్రాంతి రేసులో ఎవరిది పై చేయి అవుతుందన్నది చూడాలి.