మరో డిజాస్టర్ రికార్డ్ నమోదు !
సక్సెస్ రేటు కనీసం 5 కూడా దాడటం లేదు అంటూ బాలీవుడ్ మీడియా లో కథనాలు వస్తున్నాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీ గడచిన నాలుగు సంవత్సరాలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఎంత పెద్ద స్టార్ హీరోలు అయినా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. సక్సెస్ రేటు కనీసం 5 కూడా దాడటం లేదు అంటూ బాలీవుడ్ మీడియా లో కథనాలు వస్తున్నాయి.
స్టార్ హీరోల సినిమాలు వచ్చిన సమయంలో సహజంగానే అంచనాలు భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమాలు ఉండక పోతే ప్రేక్షకులు మినిమం కలెక్షన్స్ కూడా ఆ సినిమాలకు ఇవ్వడం లేదు. అజయ్ దేవగన్ సినిమాకు మరోసారి అదే ఫలితం దక్కింది.
అజయ్ దేవగన్, టబు కీలక పాత్రల్లో నటించిన ఆరోన్ మే కహాన్ దమ్ థా సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. హిందీ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా మొదటి రోజు అయిదు నుంచి పది కోట్ల వసూళ్లు నమోదు చేయడం జరుగుతుంది. కొన్ని సినిమాలు అంతకు మించి వసూళ్లు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి.
ఆరోన్ మే కహాన్ దమ్ థా సినిమా మాత్రం కనీసం రెండు కోట్ల రూపాయలను కూడా వసూళ్లు చేయలేక పోయింది. అజయ్ దేగన్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాల్లో అత్యల్ప మొదటి రోజు వసూళ్లు సాధించిన సినిమాగా ఈ సినిమా చెత్త, డిజాస్టర్ రికార్డ్ ను నమోదు చేయడం జరిగింది.
ఈ సినిమాను తక్కువ థియేటర్ లలోనే విడుదల చేయడం జరిగింది. అయినా కూడా ఆక్యుపెన్సీ కేవలం 9.16 మాత్రమే నమోదు అవ్వడం అందరికి షాక్ ఇచ్చింది. స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటి పరిస్థితి ఉంటే ఇండస్ట్రీ మనుగడ ఎలా అంటూ చాలా మంది ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.